MP Arvind Vs MLA Sanjay | “ఎమ్మెల్యే సంజయ్ ‘జగిత్యాల జోకర్’.. రాజకీయ అంతు చూసేవరకు వదిలిపెట్టను”.. ఎంపీ అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: MP Arvind Vs MLA Sanjay | నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో రాజకీయ సెగలు ఒక్కసారిగా రాజుకున్నాయి. కేంద్రీయ విద్యాలయం (కేవీ) ఏర్పాటు అంశంపై జగిత్యాల శాసనసభ్యుడు డాక్టర్ సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్​ అత్యంత ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే సంజయ్‌ను ‘జగిత్యాల జోకర్’ అని అభివర్ణిస్తూ, ఆయనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

MP Arvind Vs MLA Sanjay | రాజకీయ అంతు చూసే వరకు వదిలిపెట్టను!

కేంద్రీయ విద్యాలయం విషయంలో ఎమ్మెల్యే సంజయ్ వైఖరిని తప్పుబడుతూ ఎంపీ అరవింద్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. “I will see your political end” (నీ రాజకీయ అంతు చూస్తాను) అంటూ ఓపెన్ వార్నింగ్ ఇచ్చారు.

నియోజకవర్గ అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, ఇకపై ఈ విషయంలో తగ్గేదే లేదని స్పష్టం చేశారు.

MP Arvind Vs MLA Sanjay | నెక్స్ట్ రెండేళ్లు జగిత్యాల పైనే ఫోకస్

ఈ వివాదం నేపథ్యంలో ఎంపీ అరవింద్ ఒక కీలక ప్రకటన చేశారు. “వచ్చే రెండేళ్ల పాటు నేను నిజామాబాద్ వాడిని కాదు.. జగిత్యాల వాడిని” అని పేర్కొంటూ, తన పూర్తి రాజకీయ శ్రద్ధను జగిత్యాల నియోజకవర్గంపైనే పెట్టబోతున్నట్లు ప్రకటించారు.

రేపటి నుంచి నిజామాబాద్‌కు కొంత గ్యాప్ ఇచ్చి, జగిత్యాలలోనే మకాం వేసి అక్కడి రాజకీయాలను, ప్రజా సమస్యలను దగ్గరుండి చూసుకుంటానని తెలిపారు.

MP Arvind Vs MLA Sanjay | వేడెక్కిన రాజకీయం:

ఎంపీ అర్వింద్​ చేసిన ఈ తాజా సవాల్‌తో జగిత్యాల జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఒకవైపు కేంద్రీయ విద్యాలయం చుట్టూ తిరుగుతున్న వివాదం, మరోవైపు “రాజకీయ అంతు చూస్తా” అంటూ ఎంపీ ఇచ్చిన వార్నింగ్.. రాబోయే రోజుల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మరింత బలమైన రాజకీయ యుద్ధానికి దారితీసేలా కనిపిస్తోంది. మరి ఎంపీ అర్వింద్​ సవాల్‌పై ఎమ్మెల్యే సంజయ్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Southwest Monsoon Kerala | ఈ నెల 26న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు..మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *