Mla Madan Mohan | లింగంపల్లి ఖుర్దు, అడ్విలింగాల వంతెనలకు నిధులు మంజూరు: ఎమ్మెల్యే మదన్​మోహన్​

Shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Mla Madan Mohan | లింగంపల్లి ఖుర్దు, అడ్విలింగాల వంతెనలకు నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే మదన్​మోహన్(madan mohan mla) పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ (Yellareddy Constituency) అభివృద్ధి కోసం ఆయన హైదరాబాద్‌లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను (Deputy CM Bhatti Vikramarka) మంగళవారం మర్యాదపూర్వకంగా కలుసుకుని నియోజకవర్గంలోని అత్యవసర సమస్యలపై చర్చించారు.

Mla Madan Mohan | వరదల కారణంగా..

ఇటీవల వరదల కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న లింగంపల్లి ఖుర్దు బ్రిడ్జి, అడ్విలింగాల వంతెనల నిర్మాణానికి(yellareddy news) తక్షణ నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే డిప్యూటీ సీఎంకు విజ్ఞప్తి చేశారు. ఈ రెండు వంతెనల పునర్నిర్మాణంతో రైతులు, సాధారణ ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడి రోజువారీ కార్యకలాపాలు సులభతరం అవుతాయని ఆయన వివరించారు. ఇటీవల వరద ప్రభావిత ప్రాంతాలను సీఎం రేవంత్ రెడ్డి (CM revanth Reddy) స్వయంగా సందర్శించిన విషయాన్ని గుర్తుచేస్తూ, సమస్య తీవ్రతను ఉప ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Mla Madan Mohan | అభివృద్ధి కార్యక్రమలు వేగవంతం..

అదేవిధంగా, నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తయ్యేందుకు కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ అంశాలపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సానుకూలంగా స్పందించారు. లింగంపల్లి ఖుర్దు వంతెన, అడ్విలింగాల వంతెన మంజూరు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్ బిల్లుల సమస్య పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి: Kishan Reddy Letter | సీఎం రేవంత్​రెడ్డికి కేంద్రమంత్రి కిషన్​రెడ్డి లేఖ

 

4 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *