Nizamabad Police Commissionerate | నిజామాబాద్ పోలీస్​​ కమిషనరేట్​ పరిధిలో హెడ్​కానిస్టేబుళ్లకు పదోన్నతులు..

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో హెడ్​కానిస్టేబుళ్లకు పదోన్నతులు లభించాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Police Commissionerate | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్​ పరిధిలో(Nizamabad Police) హెడ్​కానిస్టేబుళ్లకు పదోన్నతులు లభించాయి. ఈ మేరకు సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) ఉత్తర్వులు జారీ చేశారు.

Nizamabad Police Commissionerate | హెడ్​కానిస్టేబుళ్లకు..

11 మంది హెడ్​కానిస్టేబుళ్లకు ఏఎస్సై(సివిల్​)గా అడహక్​ పదోన్నతులు కల్పిస్తూ పోలీస్​కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు. పదోన్నతి పొందిన వారిని వివిధ పోలీస్​స్టేషన్లలో పదోన్నతులు కల్పిస్తూ ఆదేశాలు వెలువడ్డాయి. పదోన్నతి పొందిన వారిలో ఎస్​ గంగాధర్​ రావు(నందిపేట్​), రాజేశ్వర్​ (వేల్పూర్​​), పి. మోహన్​(డబ్ల్యూపీఎస్​,నిజామాబాద్​), జగదీశ్వర్​(పీసీఆర్​, నిజామాబాద్​), చిన్న సాయిలు (బోధన్​ రూరల్​ పీఎస్​), రాజశేఖర్​(ధర్పల్లి), రాజేందర్​(సిరికొండ), సుదర్శన్​(టౌన్​–1 పీఎస్ నిజామాబాద్​) డేనియల్​ భాస్కర్​(బోధన్​ టౌన్​), సుంకన్న (నందిపేట్​), మల్లేశం(రెంజల్​) ఉన్నారు. పదోన్నతి పొందిన సిబ్బంది వెంటనే ఆయా స్థానాల్లో రిపోర్ట్​ చేయాలని సీపీ ఆదేశాలు జారీ చేశారు.

ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ సంచలన సవాల్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *