Greece F-4 Crash | ఎయిర్ షోలో కూలిన ఎఫ్-4 ఫాంటమ్ యుద్ధ విమానం.. ఇద్దరు పైలట్లు మృతి

గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని తనగ్రా ఎయిర్ బేస్‌లో జరిగిన వార్షికోత్సవ వేడుకలు తీవ్ర విషాదంగా మారాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Greece F-4 Crash | గ్రీస్ రాజధాని ఏథెన్స్ సమీపంలోని తనగ్రా ఎయిర్ బేస్‌లో జరిగిన వార్షికోత్సవ వేడుకలు తీవ్ర విషాదంగా మారాయి. ఎయిర్ షోలో భాగంగా విన్యాసాలు ప్రదర్శిస్తున్న గ్రీక్ వాయుసేనకు చెందిన ఎఫ్-4 ఫాంటమ్ (F-4 Phantom) యుద్ధ విమానం ఒక్కసారిగా అదుపుతప్పి నేలపై కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో విమానాన్ని నడుపుతున్న ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

Greece F-4 Crash | భారీగా మంటలు ..

యుద్ధ విమానం నేలను ఢీకొన్న వెంటనే భారీగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ఈ విన్యాసాలను చూసేందుకు వేలాది మంది ప్రజలు అక్కడికి తరలివచ్చారు. అయితే, ప్రమాద సమయంలో విమానం ప్రేక్షకులున్న ప్రాంతానికి దూరంగా పడిపోవడంతో పెను ప్రాణనష్టం తప్పిందని, సందర్శకులెవరికీ గాయాలు కాలేదని అధికారులు వెల్లడించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఈ విషాదకర ఘటనతో ఎయిర్ బేస్‌లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. విమానం గాల్లో చక్కర్లు కొడుతూ అకస్మాత్తుగా నేలకూలిన భయానక దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ ప్రమాదానికి సాంకేతిక లోపమే కారణమా లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో గ్రీక్ రక్షణ దళాలు ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించాయి.


ఇది కూడా చదవండి:  Monkey Menace | కోతుల బెడద నివారణకు వినూత్నప్రయోగం..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *