అక్షరటుడే, బాల్కొండ: Monkey Menace | కోతుల బెడద నివారణకు వినూత్నప్రయోగం చేశారు. బాల్కొండ (Balkonda) మండలం కిసాన్‌నగర్‌లో గ్రామంలో కోతుల(Monkey) బెడద నివారణకు గ్రామస్తులు యువకుడితో చింపాంజీ వేషం వేయించారు.
Monkey Menace | కోతులను దాటించే ప్రయత్నం..
కోతుల కారణంగా గ్రామంలో చిన్నాపెద్దా ఎన్నో అవస్థలు పడ్డామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఇళ్లలోకి చొరబడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుండటంతో వాటిని తరిమేందుకు ఈ విధానాన్ని చేపట్టినట్లు వారు తెలిపారు. ఆదివారం పెద్దసంఖ్యలో కోతులను గ్రామం నుంచి తరిమేసినట్లు చెప్పారు. కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రామరాజు గౌడ్, వీడీసీ అధ్యక్షుడు కొండ అశోక్, 10వ వార్డు సభ్యురాలు శ్యామల శ్రీనివాస్, ఎంపల సుదర్శన్, ప్రవీణ్, భూపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డి రాజ్ గోపాల్ పేరు చెప్పగానే..