అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Iran US Ship Attacks | పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. ఇరాన్–అమెరికా పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. దీంతో చమురు ధరలు పెరగడంతో పాటు ప్రపంచ మార్కెట్లు పడిపోతున్నాయి.
కొన్ని రోజులుగా ప్రశాంతంగా ఉన్న పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. శనివారం అమెరికా ఇరాన్ నౌకలపై దాడులు చేసింది. దీంతో ప్రతికారంగా టెహ్రాన్ సైతం దాడులకు దిగింది. ఖార్గ్ ద్వీపం సమీపంలో ఉన్న ఒక చమురు ట్యాంకర్‌తో సహా, ఇరాన్‌కు చెందిన రెండు చమురు ట్యాంకర్లను నిలిపివేశామని, ఒమన్ గల్ఫ్‌లో మూడవ దానిని “పూర్తిగా ధ్వంసం చేశామని” అమెరికా సైన్యం తెలిపింది. ఈ దాడులను ఇరాన్ ప్రభుత్వ మీడియా ధృవీకరించింది.
Iran US Ship Attacks | ఐఆర్జీసీ ప్రతిదాడులు
అమెరికాకు అనుబంధంగా ఉన్న మూడు నౌకలపై, అలాగే హర్ముజ్ (Harmoz) జలసంధి గుండా “అనధికారిక” మార్గంలో ప్రయాణిస్తున్న మూడు చమురు ట్యాంకర్లపై దాడి చేసినట్లు ఐఆర్జీసీ తెలిపింది. అమెరికా నౌకలను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ పేర్కొంది. మరోవైపు అమెరికా విమానవాహక నౌక, గైడెడ్-మిస్సైల్ డిస్ట్రాయర్‌ను లక్ష్యంగా చేసుకుని ఐఆర్జీసీ జరిపిన పలు దాడులను తిప్పికొట్టామని అమెరికా సైన్యం తెలిపింది. తమ దాడుల్లో అమెరికా నౌకలు తీవ్రంగా దెబ్బతిన్నాయని టెహ్రాన్ పేర్కొంది. తమ నౌకలపై దాడులు చేస్తే.. తీవ్ర ప్రతిస్పందన ఉంటుందని ఇరాన్ హెచ్చరించింది. గతంలో కంటే ఇప్పుడు తాము మరింత బలంగా ఉన్నామని తెలిపింది. ఇరాన్ దాడుల నుంచి తమ నౌకలు సురక్షితంగా తప్పించుకున్నాయని అమెరికా ప్రకటించింది.
దీనిని కూడా చదవండి : Konda Surekha Rakhi | కొండా సురేఖతో అందుకే రాఖీ కట్టించుకున్న : సీఎం రేవంత్ రెడ్డి