అక్షరటుడే వెబ్‌డెస్క్: Paris Knife Attack | ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఒక మతోన్మాది తీవ్ర ఉద్రిక్తత సృష్టించాడు. చేతిలో రెండు కత్తులతో రోడ్డుపైకి వచ్చి భయానక వాతావరణం సృష్టించాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఒక గర్భిణితో పాటు మరో ముగ్గురు మహిళలపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పరిగెత్తుకుంటూ వెళ్తూ కనిపించిన మహిళలందరిపై కత్తులతో విరుచుకుపడ్డాడు. స్థానికులు ఎంతగా కేకలు వేస్తున్నప్పటికీ అతడు తన దాడిని ఆపలేదు. ఈ ఘాతుకానికి సంబంధించిన దృశ్యాలను కొందరు తమ మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేశారు.
Paris Knife Attack | ఉగ్రవాద కోణంలోనూ దర్యాప్తు..
ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన ఆ యువకుడిని స్థానికులు ధైర్యంగా వెంబడించి పట్టుకున్నారు. అనంతరం అతడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసుల అదుపులోకి వెళ్లే సమయంలో ఆ యువకుడు “అల్లా తనకు ఆదేశాలు ఇచ్చాడు” అంటూ విచిత్రంగా వ్యాఖ్యానించాడు. దీంతో అతడి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై అన్ని కోణాలతో పాటు ఉగ్రవాద కోణంలోనూ లోతుగా దర్యాప్తు జరుపుతున్నారు. స్థానికులు పట్టుకున్న సమయంలోనూ ఆ నిందితుడి కదలికలు ఎంతో అనుమానాస్పదంగా ఉన్నాయి. చుట్టూ పరిశీలిస్తూ, భయపడుతూ అతడు చేసిన విచిత్ర చేష్టలు అక్కడి ప్రజలను మరింత భయాందోళనకు గురిచేశాయి.
സമാധാനം പാരിസ്-ൽ:
ഗര്ഭിണിയായ സ്ത്രീയെ അടക്കം, മൂന്ന് സ്ത്രീകളെ കത്തികൊണ്ട് ആക്രമിച്ചയാളെ സമീപത്തുണ്ടായിരുന്നയാൾക്കാര് പിടികൂടി.
🤲🏼💣 pic.twitter.com/3vAU2sPikl— ◢◤ Vijay 🇮🇳 (@peregrine__1) July 28, 2026
ఇది కూడా చదవండి: Tirmalapur Gram Sabha | గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం.. తిర్మలాపూర్ జీపీలో తీర్మానాలు