అక్షరటుడే వెబ్‌డెస్క్: Rahul Gandhi Demands | దేశ యువత ప్రయోజనాలే తమ ప్రభుత్వ మొదటి ప్రాధాన్యత అంటూ ప్రధాని మోదీ ( Narendra Modi ) చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. దేశ యువత భవిష్యత్తును తీవ్రంగా దెబ్బతీసింది మీరేనని ఆయన ఘాటుగా బదులిచ్చారు. విద్యా వ్యవస్థను నాశనం చేసేవారిని ప్రోత్సహించడంతో పాటు బాధ్యులను మీరే కాపాడారని ఆరోపించారు.
Rahul Gandhi Demands | రాహుల్ గాంధీ డిమాండ్లు..
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి వెంటనే రాజీనామా చేయాలని, దేశంలోని విద్యార్థులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. పేపర్ లీక్ ఘటనలపై తీవ్రస్థాయిలో స్పందించిన ఆయన, శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దాడులకు పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
Rahul Gandhi Demands | కొనసాగుతున్న ఆందోళనలు..
ఈ వివాదంపై ప్రధాని మోదీ స్పందిస్తూ.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి నిందితులకు తక్షణ శిక్ష పడేలా చూస్తామని మాత్రమే హామీ ఇచ్చారు. అయితే పేపర్ లీక్ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ పదవి నుంచి తప్పుకోవాలని విద్యార్థులు, విపక్షాలు డిమాండ్ చేస్తున్నారు . కేంద్రం మాత్రం ఈ డిమాండ్‌పై వెనక్కి తగ్గేది లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. మరోవైపు, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన ఆందోళనకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి మద్దతు రోజురోజుకూ పెరుగుతోంది.
ఇది కూడా చదవండి: Anantnag Terrorists Houses | ఇద్దరు ఉగ్రవాదుల ఇళ్లు కూల్చివేత