Sukriti Veni Scholarship | అంతర్జాతీయ వేదికపై అదరగొట్టిన సుకుమార్ కూతురు.. ఏకైక సింగర్‌గా రికార్డు

టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభతో సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Sukriti Veni Scholarship | టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్ కుమార్తె సుకృతి వేణి చిన్న వయసులోనే అద్భుతమైన ప్రతిభతో సినీ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా ‘గాంధీ తాత చెట్టు’ చిత్రంలో అద్భుత నటన కనబరిచి బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా నేషనల్ అవార్డును దక్కించుకున్న ఆమె.. నటనతో పాటు సింగర్‌గానూ అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. తాజాగా ఆమె సాధించిన మరో అరుదైన మైలురాయి అందరి ప్రశంసలు అందుకుంటోంది.

Sukriti Veni Scholarship |ఎన్‌సెంబల్ ఎక్సెలన్స్ అవార్డు..

అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న ప్రపంచ ప్రఖ్యాత ‘బర్క్‌లీ స్కూల్ ఆఫ్ మ్యూజిక్’లో ప్రదర్శించిన ప్రతిభకు గానూ సుకృతి వేణికి ‘ఎన్‌సెంబల్ ఎక్సెలన్స్ అవార్డు’ లభించింది. అంతేకాకుండా, ఆ ప్రతిష్టాత్మక విద్యాసంస్థలో ఎలాంటి ఫీజు చెల్లించకుండా ఉచితంగా చదువుకునేందుకు వీలుగా ఆమె ఫుల్ స్కాలర్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు.

sukumar.1

Sukriti Veni Scholarship | ప్రపంచవ్యాప్తంగా పోటీ పడిన 272 మంది..

ఈ అత్యంత పోటీతో కూడిన స్కాలర్‌షిప్ ఆడిషన్స్‌లో ప్రపంచ నలుమూలల నుంచి మొత్తం 272 మంది విద్యార్థులు పోటీ పడగా.. చివరికి కేవలం 14 మంది మాత్రమే పూర్తి స్కాలర్‌షిప్‌కు ఎంపికయ్యారు. విశేషమేమిటంటే, ఈ సింగర్స్ కేటగిరీ నుంచి ఫుల్ స్కాలర్‌షిప్ దక్కించుకున్న ఏకైక విద్యార్థిగా సుకృతి వేణి నిలిచి సరికొత్త రికార్డు సృష్టించారు. తండ్రికి తగ్గ తనయగా అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తి ప్రతిష్టలను చాటుతున్న సుకృతి వేణిని టాలీవుడ్ ప్రముఖులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


ఇది కూడా చదవండి:  Prakash Raj Vote | వీడియో పెడితేనే ఓటా?.. ఈసీ అధికారులపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *