అక్షరటుడే వెబ్‌డెస్క్: Semicon 2.0 Scheme | దేశంలో సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల భారీ వ్యయంతో ‘సెమికాన్ 2.0’ పథకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. చిప్ పరిశ్రమకు ప్రతి దశలో ఆర్థిక భద్రత, పూర్తి స్థాయి మద్దతు అందించేలా ఈ కొత్త పథకాన్ని రూపొందించారు. సెమీకండక్టర్ డిజైన్, చిప్ తయారీకి అవసరమైన పరికరాలు-పదార్థాల ఉత్పత్తి, ఫ్యాబ్రికేషన్ యూనిట్లు, చిప్ అసెంబ్లీ-ప్యాకేజింగ్, పరిశోధన-అభివృద్ధి (R&D), నైపుణ్యం కలిగిన మానవ వనరుల అభివృద్ధి అనే ఆరు కీలక అంశాల ప్రాతిపదికన సెమికాన్ 2.0ను తీర్చిదిద్దారు. కేవలం తయారీ ప్లాంట్లకే పరిమితం కాకుండా సమగ్ర చిప్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేయడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశం.
Semicon 2.0 Scheme | సెమీకండక్టర్ డిజైన్‌తో..
భారతీయ కంపెనీలు చేపట్టే సెమీకండక్టర్ డిజైన్‌తో పాటు క్యాపిటల్ ఎక్విప్‌మెంట్, ఫ్యాబ్రికేషన్, ప్యాకేజింగ్ రంగాలకు ఈ పథకం కింద మద్దతు లభిస్తుంది. అర్హత కలిగిన వ్యూహాత్మక సెమీకండక్టర్ చిప్‌లను గుర్తించేందుకు ఒక ఉన్నతస్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రధాన శాస్త్రీయ సలహాదారు, జాతీయ భద్రతా సలహాదారు (NSA) సంయుక్తంగా ఈ కమిటీకి అధ్యక్షత వహించి, జాతీయ ప్రాధాన్యత ఆధారంగా ప్రోత్సాహకాలను నిర్ణయిస్తారు.
Semicon 2.0 Scheme | దిగుమతుల తగ్గింపు లక్ష్యంగా..
ఈ రంగంలో దేశీయ సామర్థ్యాలను పెంచడం ద్వారా విదేశీ సరఫరాలపై భారత్ ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని కేంద్రం భావిస్తోంది. ముఖ్యంగా సెన్సర్ల తయారీలో దేశీయ అవసరాలను వంద శాతం వరకు తీర్చేలా సామర్థ్యాన్ని అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, టెలికమ్యూనికేషన్స్, రక్షణ రంగాలు చిప్‌ల కోసం పూర్తిగా వీటిపై ఆధారపడాల్సి ఉండటంతో, ఈ వ్యూహాత్మక నిర్ణయం దేశ భవిష్యత్తుకు అత్యంత కీలకం కానుంది.
🚨 BIG NEWS 🇮🇳: Government notifies the ₹1.27 lakh crore Semicon 2.0 scheme with a six-pillar strategy.
The scheme will provide fiscal support across six key segments of the semiconductor value chain, including chip design, fabrication, packaging, and testing.
Another major… pic.twitter.com/3R1gFROe8J
— Ary Sangwan (@Arysangwan) August 31, 2026
ఇది కూడా చదవండి: Crude Oil Prices | క్రూడ్ ఆయిల్ ధరల ప్రభావం.. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు