Exit Polls | ఎగ్జిట్ పోల్స్.. వెస్ట్ బెంగాల్‌లో బీజేపీ, తమిళనాడులో డీఎంకే హవా!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Exit Polls | ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న వేళ, ‘చాణక్య స్ట్రాటజీస్’ (Chanakya Strategies) తన ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలను వెల్లడించింది. ముఖ్యంగా పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో అధికార మార్పిడి, పట్టుపై ఆసక్తికర అంచనాలను వెలువరించింది.

Exit Polls | పశ్చిమ బెంగాల్​లో (West Bengal) కమలం..

పశ్చిమ బెంగాల్‌లోని మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు గాను పార్టీల వారీగా అంచనాలు చూస్తే, బీజేపీ 150-160 సీట్లు సాధించి అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉందని సర్వే పేర్కొంది. తృణమూల్ కాంగ్రెస్ (TMC) 130-140 స్థానాలకు పరిమితం కాగా, కాంగ్రెస్ పార్టీ 2-4 సీట్లు, ఇతరులు 4-6 సీట్లు గెలుచుకుంటారని అంచనా వేసింది.

Exit Polls | తమిళనాడులో (Tamil Nadu) డీఎంకే..

తమిళనాడులో మరోసారి డీఎంకే కూటమి తన అధికారాన్ని నిలబెట్టుకోనుందని సర్వే స్పష్టం చేసింది. మొత్తం 234 అసెంబ్లీ స్థానాలకు గాను డీఎంకే కూటమి 145-160 సీట్లు సాధించే అవకాశం ఉంది. ఇక ఏఐఏడీఎంకే (AIADMK) 50-65 స్థానాలు, టీవీకే (TVK) 13-18 స్థానాలు, ఇతరులు 5-8 సీట్లు గెలుచుకోవచ్చని సర్వే వెల్లడించింది.

మొత్తానికి బెంగాల్‌లో బీజేపీ కొత్తగా జెండా పాతే అవకాశం ఉండగా, తమిళనాడులో మాత్రం ప్రస్తుత అధికార పక్షమే మళ్లీ పీఠాన్ని దక్కించుకోనుందని చాణక్య స్ట్రాటజీస్ విశ్లేషించింది.

ఇది కూడా చదవండి..: DSP Promotions | 35 మందికి ఇన్​స్పెక్టర్లకు డీఎస్పీలుగా పదోన్నతి

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *