అక్షరటుడే, వెబ్‌డెస్క్ : VD Satheesan CM Oath | కేరళం (Keralam) సీఎంగా సోమవారం వీడీ సతీషన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉదయం 10 గంటలకు సీఎంతో పాటు పలువురు మంత్రులు ప్రమాణం చేస్తారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (UDF) కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి పదవి కోసం పలువురు పోటీ పడగా.. చివరకు కాంగ్రెస్ అధిష్టానం సీనియర్ నాయకుడు వీడీ సతీషన్‌ను ఎంపిక చేసింది. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. దాదాపు ఆరు దశాబ్దాల తర్వాత ముఖ్యమంత్రితో పాటు పూర్తి మంత్రివర్గం ప్రమాణం చేయనున్నట్లు తెలిపారు.
VD Satheesan CM Oath | ముస్లిం లీగ్‌కు అవకాశం
యూడీఎఫ్ కూటమిలోని ముస్లిం లీగ్‌కు సైతం కాంగ్రెస్ మంత్రి పదవులు ఇవ్వనుంది. ఇప్పటికే ఆ పార్టీ మంత్రులు కాబోయే అభ్యర్థులను ప్రకటించింది. మరోవైపు కాంగ్రెస్‌లో సైతం పలువురిని ఎంపిక చేసినట్లు వీడీ సతీషన్ తెలిపారు. సామాజిక సమీకరణాలు, ఇతర కారణాలతో పలువురు అర్హులైన నాయకులకు కూడా కేబినెట్లో చోటు కల్పించలేకపోయామన్నారు. అందుకు ఆయన విచారం వ్యక్తం చేశారు. రేపు తనతో పాటు రమేష్ చెన్నితాల, KPCC అధినేత సన్నీ జోసెఫ్, కె. మురళీధరన్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. తిరువంచూర్ రాధాకృష్ణన్ స్పీకర్‌గా, షానిమోల్ ఉస్మాన్ డిప్యూటీ స్పీకర్‌గా ఉంటారని ఆయన తెలిపారు.
VD Satheesan CM Oath | శాఖల కేటాయింపు పూర్తి
మంత్రులకు శాఖల కేటాయింపు దాదాపుగా ఖరారైందని వీడీ సతీషన్ తెలిపారు. కొన్ని చిన్నపాటి సవరణలు మాత్రమే మిగిలి ఉన్నాయన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ జాబితాను గవర్నర్‌కు సమర్పిస్తామన్నారు. అనంతరం ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుందని పేర్కొన్నారు.
#WATCH | Keralam Chief Minister-designate VD Satheesan announces the names of his cabinet ministers, who will take the oath alongside him at tomorrow’s swearing-in ceremony.
The cabinet ministers include Ramesh Chennithala, KPCC Chief Sunny Joseph, and K Muraleedharan.… pic.twitter.com/WwhsBMFNlV
— ANI (@ANI) May 17, 2026
దీనిని కూడా చదవండి : Rajinikanth Vijay | ఆయన సీఎం అయితే అసూయ పడేవాడిని.. రజనీకాంత్ సంచలన వ్యాఖ్యలు


