Rajinikanth Vijay | ఆయన సీఎం అయితే అసూయ పడేవాడిని.. రజనీకాంత్​ సంచలన వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Rajinikanth Vijay | తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరలేపుతూ తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) అధినేత విజయ్ (Vijay) ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే విజయ్ అధికారంలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో పలు ఊహాగానాలు, ప్రచారాలు పెద్ద ఎత్తున వైరల్ అయ్యాయి.

ముఖ్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ విజయ్ విజయం పట్ల అసంతృప్తిగా ఉన్నారని, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలవడం వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ ప్రచారాలు రోజురోజుకీ పెరుగుతుండటంతో రజనీకాంత్ స్వయంగా మీడియా ముందుకు వచ్చి వివరణ ఇచ్చారు. తాను మౌనంగా ఉండటం వల్లే తప్పుడు కథనాలు పెరిగిపోతున్నాయని పేర్కొన్నారు. అందుకే స్పష్టత ఇవ్వడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

Rajinikanth Vijay | ఎలాంటి రాజ‌కీయ కోణాలు లేవు

స్టాలిన్‌ను కలవడం వెనుక ఎలాంటి రాజకీయ కోణం లేదని రజనీకాంత్ తేల్చిచెప్పారు. “స్టాలిన్‌తో (Stalin) నాకు చాలా సంవత్సరాల అనుబంధం ఉంది. అది రాజకీయాలకు అతీతమైన స్నేహం. ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం వ్యక్తిగతంగా నన్ను బాధించింది. అందుకే స్నేహితుడిగా పరామర్శించడానికి వెళ్లాను. విజయ్ సీఎం కాకుండా అడ్డుకోవడానికి కాదు. నేను అలాంటి రాజకీయాలు చేయను” అని అన్నారు. ఇక విజయ్‌పై అసూయ ఉందనే ప్రచారాలను కూడా రజనీకాంత్ ఖండించారు. తనకు, విజయ్‌కు మధ్య దాదాపు 28 సంవత్సరాల వయసు తేడా ఉందని పేర్కొన్నారు. విజయ్ సాధించిన విజయాన్ని తాను గౌరవిస్తానని, ప్రజలు మార్పు కోరుకున్నందుకే ఆయనను ఎన్నుకున్నారని అభిప్రాయపడ్డారు. కమల్​ హాసన్​ సీఎం అయితే అసూయ పడతానని పేర్కొన్నారు.

Rajinikanth Vijay | షాక్​ అయ్యా

‘రెండు ప్రధాన రాజకీయ పార్టీలను ఒంటరిగా ఎదుర్కొని చాలా తక్కువ సమయంలో ముఖ్యమంత్రి స్థాయికి చేరుకోవడం సాధారణ విషయం కాదు. ఆ విషయం తెలిసి నేను కూడా ఆశ్చర్యపోయాను. ముఖ్యమంత్రిగా గెలిచిన వెంటనే నేను విజయ్‌కు ఫోన్ చేసి అభినందనలు తెలియజేశాను” అని రజనీకాంత్ వెల్లడించారు. అదే సమయంలో గతంలో తన రాజకీయ ప్రయాణం గురించి కూడా రజనీ మాట్లాడారు. ఒక సమయంలో రాజకీయ పార్టీ స్థాపించి ఉంటే పరిస్థితులు వేరుగా ఉండేవని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం తాను రాజకీయాలకు పూర్తిగా దూరమయ్యానని స్పష్టం చేశారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి వచ్చి రాష్ట్ర అత్యున్నత పదవిని అందుకున్న విజయ్ పట్ల తనకు గర్వమే తప్ప ఎలాంటి ద్వేషం లేదని రజనీకాంత్ (Rajinikanth) తెలిపారు.

దీనిని కూడా చదవండి : CNG Price Hike | మళ్లీ పెరిగిన సీఎన్​జీ ధరలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *