జాతీయంCNG Price Hike | మళ్లీ పెరిగిన సీఎన్​జీ ధరలు

CNG Price Hike | మళ్లీ పెరిగిన సీఎన్​జీ ధరలు

కేంద్ర ప్రభుత్వం సీఎన్​జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్​జీపై ఒక రూపాయి పెంచుతున్నట్లు ప్రకటించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : CNG Price Hike | కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎన్​జీ ధరలను మరోసారి పెంచింది. కిలో సీఎన్​జీపై ఒక రూపాయి పెంచుతున్నట్లు ప్రకటించింది. రెండు రోజుల క్రితం సీఎన్​జీ ధర రెండు రూపాయలు పెరిగింది.

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ముడి చమురు (Crude Oil) ధరల పెరుగుదల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఇంధన రేట్లను పెంచిన విషయం తెలిసిందే. పెట్రోల్​, డీజిల్​ ధరలను లీటర్​కు రూ.3 మేర పెంచింది. సీఎన్​జీ ధరలను కిలోకు రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ఉదయం నుంచి పెరిగిన రేట్లు అమలులోకి వచ్చాయి. తాజాగా ఆదివారం ఉదయం మరోసారి సీఎన్​జీ ధరలను కేంద్రం పెంచింది. రెండు రోజుల వ్యవధిలో రేట్లు పెంచడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

CNG Price Hike | పెంపు తర్వాత రేట్లు..

ఢిల్లీ (Delhi)లో కిలో CNG ధర రూ. 80.09 ఉంటుంది. నోయిడా-ఘజియాబాద్‌లలో కిలో CNG ధర రూ. 88.70 ఉంటుంది. కేవలం రెండు రోజుల్లో ధరలు పెరగడం ఇది రెండోసారి. పెరుగుతున్న ధరలు ఆటో-రిక్షా డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, ప్రైవేట్ వాహన యజమానుల నెలవారీ బడ్జెట్‌లను తలకిందులు చేశాయి. ప్రతిరోజూ సుదూర ప్రయాణాలు చేసేవారి జేబులపై ఇది ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. రేట్ల పెంపు తర్వాత ముంబైలో సీఎన్​జీ ధర రూ.84కు చేరుకుంది.

CNG Price Hike | వాహనదారుల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం ఒకేసారి రేట్లు పెంచకుండా విడతలవారిగా పెంచుతుండటంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో దేశంలోని చమురు సంస్థలు తీవ్రంగా నష్టపోతున్నాయి. ఈ క్రమంలో ఇంధన రేట్లను పెంచుకోవడానికి కేంద్రం అనుమతిచ్చింది. అయితే రానున్న రోజుల్లో పెట్రోలు, డీజిల్​ ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అన్ని వస్తువుల ధరలు పెరిగాయి. ఇంధన ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం ఉంది.

 

దీనిని కూడా చదవండి : Southwest Monsoon Kerala | ఈ నెల 26న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు..మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Nizamabad Exhibition | ఎగ్జిబిషన్​ ఒకరోజు మూసివేత.. విరిగిన పరికరాలకు కొనసాగుతున్న మరమ్మతులు..

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Exhibition | నగరంలోని పాలిటెక్నిక్​ మైదానంలో...

Hyderabad Water Supply | హైదరాబాద్ వాసులకు అలెర్ట్​.. నీటి సరఫరాలో అంతరాయం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hyderabad Water Supply | హైదరాబాద్ (Hyderabad) నగరంలోని పలు...

Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పర్చుకుని ముందుకు సాగాలి..

అక్షరటుడే, ఆర్మూర్: Tribal Student Awards | విద్యార్థులు స్పష్టమైన లక్ష్యాన్ని...

Tourist Guide Recruitment | టూరిస్ట్ గైడ్‌ల కోసం దరఖాస్తుల ఆహ్వానం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tourist Guide Recruitment | టూరిస్ట్​ గైడ్​ల...