అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Uppal Crossroad Closure | హైదరాబాద్ (Hyderabad) నగరంలో అత్యంత రద్దీగా ఉండే ఉప్పల్ చౌరస్తాను అధికారులు ఆదివారం నుంచి తాత్కాలికంగా మూసివేశారు. ఉప్పల్–నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ (Elevated Corridor) నిర్మాణ పనుల కోసం మూడు నెలల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఉప్పల్ విద్యుత్ జంక్షన్ ప్రాంతంలో ఎలివేటెడ్ కారిడార్ పిల్లర్ పనులు సాగుతున్నాయి. పనుల నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ (GHMC) కార్యాలయం పక్కన ఉన్న వరంగల్ బస్టాండ్‌ను గతంలోనే ఉప్పల్ నల్లచెరువు కట్ట వద్దకు మార్చారు. తాజాగా పలు మార్గాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నారు. రామంతాపూర్, హబ్సిగూడ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు పిస్తా హౌస్, లిటిల్ ఫ్లవర్ స్కూల్ వెనుక నుంచి బీరప్పగడ్డ మీదుగా వరంగల్ జాతీయ రహదారిని చేరుకోవాలి.
Uppal Crossroad Closure | హయత్‌నగర్ మీదుగా..
నాగోల్, ఎల్బీనగర్ వైపు నుంచి వరంగల్ వెళ్లే వాహనాలు హయాత్‌నగర్ మీదుగా పెద్ద అంబర్‌పేట్ వద్ద ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు పైనుంచి, సర్వీస్ రోడ్డు మార్గాన ఘట్కేసర్ వద్ద వరంగల్ జాతీయ రహదారికి చేరుకోవాల్సి ఉంటుంది. ఫీర్జాదిగూడ వైపు నుంచి సికింద్రాబాద్ వెళ్లే వాహనాలు లక్ష్మారెడ్డి కాలనీ మీదుగా వెళ్లి ఉప్పల్ మెట్రో స్టేషన్ వద్ద ఉన్న మాస్టర్ చెఫ్ రెస్టారెంట్ చేరుకొని, అక్కడ యూ టర్న్ తీసుకోవాలి. ఫీర్జాదిగూడ నుంచి నాగోల్ వెళ్లాలంటే ఉప్పల్ భగాయత్ లేఔట్ ద్వారా చేరుకోవాల్సి ఉంటుంది. నాగోల్ నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు కూడా భాగాయత్ మీదుగా వెళ్ళాల్సి ఉంటుంది. హుబ్సిగూడ నుంచి నాగోల్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ఆంక్షలు లేవని అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Fake Doctor Arrest | ఇంటర్ ఫెయిల్.. డాక్టర్‌గా చెలామణి.. నకిలీ వైద్యుడిని అరెస్ట్ చేసిన పోలీసులు


