America Iran Tensions | మళ్లీ యుద్ధం తప్పదా.. డోనాల్డ్​ ట్రంప్​ సంచలన పోస్ట్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : America Iran Tensions | అమెరికా–ఇరాన్​ మధ్య కాల్పుల విరమణ అమలులో ఉండటంతో పశ్చిమాసియాలో వాతావరణం ఇప్పుడిప్పుడే చల్లబడుతోంది. ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ క్రమంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్​ సోషల్​ మీడియాలో పెట్టిన పోస్ట్​ తీవ్ర చర్చకు దారి తీసింది.

ఇరాన్‌పై వాషింగ్టన్ సైనిక దాడులను మళ్లీ ప్రారంభించవచ్చు అనే కోణంలో ట్రంప్​ పోస్ట్ చేశారు. AI ద్వారా రూపొందించిన ఈ చిత్రంలో, అల్లకల్లోలంగా ఉన్న సముద్రంలో యుద్ధనౌకల ముందు నిలబడి ట్రంప్ నేరుగా కెమెరా వైపు వేలు చూపిస్తూ కనిపించారు. అనేక నౌకలపై ఇరాన్ జెండాలతో పాటు “ఇది తుఫానుకు ముందు ప్రశాంతత” (It Was The Calm Before The Storm) అని పోస్ట్ చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న దౌత్య ప్రయత్నాలు విఫలమైతే ఇరాన్‌పై తిరిగి సైనిక చర్య చేపట్టేందుకు అమెరికా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని వార్తలు వెలువడుతున్న తరుణంలో ఈ పోస్ట్ వచ్చింది.

America Iran Tensions | ఆపరేషన్​ ఎపిక్ ఫ్యూరీ 2.0

శాంతి చర్చలలో వేగం తగ్గిన నేపథ్యంలో అమెరికా కొత్త దశ కార్యకలాపాల కోసం ప్రణాళికలను అభివృద్ధి చేసింది. దీనిని అంతర్గతంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ 2.0 అని పిలుస్తున్నట్లు సమాచారం. ఏప్రిల్ 7న కాల్పుల విరమణ ప్రకటించినప్పటి నుంచి సైనిక దాడులు నిలిచిపోయాయి. తాజాగా ట్రంప్​ పోస్ట్​తో మళ్లీ యుద్ధం మొదలు అవుతుందా అనే భయాందోళనలు నెలకొన్నాయి. ట్రంప్ తన రెండు రోజుల చైనా పర్యటన అనంతరం ఈ పోస్టు చేయడం గమనార్హం.

America Iran Tensions | సిద్ధంగా ఉన్నాం

తిరిగి పోరాటానికి దిగేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని ఇరాన్ (Iran) అధికారులు కూడా సంకేతాలు ఇచ్చారు. ఏ విధమైన దురాక్రమణకైనా తగిన ప్రతిస్పందన ఇవ్వడానికి మా సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. తప్పుడు వ్యూహం, తప్పుడు నిర్ణయాలు ఎల్లప్పుడూ తప్పుడు ఫలితాలకే దారితీస్తాయి అని ఇరాన్ పార్లమెంటరీ స్పీకర్ మొహమ్మద్ బఘేర్ ఘాలిబాఫ్ సోషల్ మీడియాలో రాశారు.

ఇది కూడా చదవండి : Chola Copper Plates | 14 ఏళ్ల నిరీక్షణకు తెర.. స్వదేశానికి ‘చోళుల కాలం నాటి రాగి శాసనాలు’!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *