జాతీయంGlobal Debt Crisis | అందరూ అప్పుల అప్పారావులే.. డెట్​లోనూ పెద్దన్నే ముందు!

Global Debt Crisis | అందరూ అప్పుల అప్పారావులే.. డెట్​లోనూ పెద్దన్నే ముందు!

ప్రపంచం అప్పులు ఊబిలో కూరుకుపోతోంది. చాలా దేశాలు మోయలేనంత అప్పులు చేశాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Global Debt Crisis | ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ (ఐఐఎఫ్ ) నివేదికల ప్రకారం 2025 చివరి నాటికి ప్రపంచ మొత్తం డెట్ (పబ్లిక్, ప్రైవేట్) సుమారు 353 ట్రిలియన్ డాలర్లకు చేరింది. ఇందులో ప్రభుత్వ అప్పులే సుమారు 100 నుంచి 111 ట్రిలియన్ డాలర్లు ఉన్నాయి. ప్రపంచ జీడీపీకి సాపేక్షంగా సుమారు 235-305 శాతం అప్పులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ డెట్ భారం కోవిడ్ -19 తర్వాత యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు, స్టిమ్యులస్ ప్యాకేజీలు, ప్రభుత్వాల ఖర్చుల వల్ల వేగంగా పెరిగింది.

Global Debt Crisis | ప్రధాన దేశాల డెట్ వివరాలు

ప్రపంచంలో అత్యధిక అప్పులు ఉన్న దేశం అమెరికా (America)నే.. ఆ దేశ మొత్తం అప్పులు సుమారు 32.9 ట్రిలియన్ డాలర్లు దాటాయి. ఆ దేశ డెట్ టు జీడీపీ రేషియో 120 నుంచి 126 శాతంగా ఉంది. చైనా సైతం అప్పులు ఎక్కువే చేస్తోంది. ఆ దేశ అప్పులు 15 ట్రిలియన్ డాలర్లపైనే ఉన్నాయి. డెట్ టు జీడీపీ రేషియో 88 నుంచి 99 శాతంగా ఉంది. జపాన్ (Japan) మొత్తం అప్పులు 10.9 ట్రిలియన్ డాలర్లున్నాయి. డెట్ టు జీడీపీ రేషియో 235 నుంచి 250 మధ్యలో నమోదయ్యింది. అభివృద్ధి చెందిన దేశాలలో అత్యధిక డెట్ టు జీడీపీ రేషియో ఉన్న దేశం జపానే..

ఫ్రాన్స్ 3.4 ట్రిలియన్ డాలర్ల అప్పులతో నాలుగో స్థానంలో ఉంది. ఆ దేశ డెట్ టు జీడీపీ రేషియో 113 శాతం. ఈ జాబితాలో ఇటలీ ఐదో స్థానంలో ఉంది. ఆ దేశ మొత్తం అప్పులు 3.1 ట్రిలియన్ డాలర్లు కాగా.. డెట్ టు జీడీపీ రేషియో 135 నుంచి 138 శాతంగా ఉంది. భారతదేశం 2.07 ట్రిలియన్ డాలర్ల అప్పులతో ఎనిమిదో స్థానంలో ఉంది. డెట్ టు జీడీపీ రేషియో 81 నుంచి 82.6 శాతం.

Global Debt Crisis | ప్రమాదకర స్థాయికి చేరుతున్నామా..

Global Debt Crisis

డెట్ టు జీడీపీ రేషియో అభివృద్ధి చెందుతున్న దేశాలకు 60 శాతం వరకు ఉంటే మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతారు. ఇది సురక్షిత స్థాయి అని, 90 శాతం దాటితే ప్రమాదకర స్థాయి అని పేర్కొంటారు. అయితే ఇది ఆర్థిక స్థితి, వృద్ధి రేటు, వడ్డీ రేట్లు, ఆదాయాలు, స్వదేశీ అప్పులు, విదేశీ అప్పులు తదితర అంశాలపై ఆధారపడి కాస్త అటూఇటుగా ఉన్నా పర్వాలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం భారత దేశ డెట్ టు జీడీపీ రేషియో 83 శాతానికి సమీపంలో ఉంది. ఇది ఆదర్శస్థాయికన్నా పైన ఉన్నా.. జీడీపీ వేగంగా పెరుగుతున్నందున నిర్వహించగల స్థాయిలోనే ఉందని ఐఎంఎఫ్ అభిప్రాయపడుతోంది.

ఇది కూడా చదవండి..: Paragliding Plane Collision| పారాగ్లైడర్‌ను ఢీకొట్టిన విమానం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Cattle Smuggling | పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా : ఎస్పీ రాజేష్ చంద్ర

అక్షరటుడే, కామారెడ్డి: Cattle Smuggling | బక్రీద్ పండుగ నేపథ్యంలో జిల్లాలో...

Air India Crash Report | అహ్మదాబాద్ విమాన ప్రమాద దర్యాప్తు.. నేరుగా తుది నివేదికే ఇస్తామన్న కేంద్రం

అక్షరటుడే వెబ్‌డెస్క్: Air India Crash Report | అహ్మదాబాద్‌లో(Ahmedabad) జరిగిన...

ACB Trap | భూ సర్వే చేసినందుకు లంచం.. ఏసీబీకి చిక్కిన సర్వేయర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారులు మారడం...

Karnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేదు.. దానిపైనే చర్చ

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka CM Change | కర్ణాటకలో సీఎం...