అక్షరటుడే, వెబ్‌డెస్క్ : India Canada Trade Talks | వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించే లక్ష్యంతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్, కెనడా చర్చించాయి. కెనడా వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్ధూ, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో ఈ చర్చలు జరిపారు.
భారత్-కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA)పై చర్చలను ముందుకు తీసుకెళ్లడం, మన ద్వైపాక్షిక ఆర్థిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం పై ఇరుపక్షాలు చర్చించాయని గోయల్ తెలిపారు. ఒప్పందం ప్రాముఖ్యతపై ఇద్దరు మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మంచి వాణిజ్య సంబంధాలకు, ఉమ్మడి శ్రేయస్సుకు CEPA ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుందన్నారు. భారత్-కెనడా ఆర్థిక భాగస్వామ్యాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే తమ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించామని గోయల్ తెలిపారు.
ఇది కూడా చదవండి : Abhishek Banerjee | టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంటి వద్ద అధికారుల కూల్చివేతలు