CCTV Cameras | నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకం

నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా పని చేస్తాయని భిక్కనూర్ ఎస్సై అనిల్ కుమార్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: CCTV Cameras | నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు అత్యంత కీలకంగా పని చేస్తాయని భిక్కనూర్ (Bhikkanoor) ఎస్సై అనిల్ కుమార్ అన్నారు. భాగిర్తిపల్లి గ్రామంలో ఏర్పాటుచేసిన 10 సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు.

CCTV Cameras | దర్యాప్తులో సహకరిస్తాయి..

ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. గ్రామంలోని ముఖ్యమైన ప్రదేశాలు, ప్రధాన రహదారులు, ప్రవేశ, నిష్క్రమణ మార్గాలను కవర్ చేసే విధంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామని తెలిపారు. వీటి ద్వారా గ్రామంలో జరిగే అనుమానాస్పద కార్యకలాపాలు, నేరాలను గుర్తించడంతో పాటు, నేరాల దర్యాప్తులో కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ కీలకంగా ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రజల భద్రత మరింత మెరుగుపడుతుందన్నారు. నేరాల నియంత్రణలో ప్రజల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన బాగిర్తిపల్లి గ్రామ ప్రజలకు, గ్రామ పెద్దలకు, సంబంధిత ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

ఇది కూడా చదవండి: సముద్ర తీరానికి కొట్టుకొచ్చిన రబ్బర్ ఫెండర్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *