Bike Tractor Accident | కంజరలో రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్​ బైక్ ఢీ​కొని ఇద్దరు మృతి

ట్రాక్టర్​, బైక్ ఎదురెదురుగా​ ఢీకొని ఇద్దరు మృతి చెందారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ రూరల్​ : Bike Tractor Accident | ట్రాక్టర్​, బైక్ ఎదురెదురుగా​ ఢీకొని ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన మోపాల్ (Mopal)​ మండలంలోని కంజరలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది.

Bike Tractor Accident | ఎదురెదురుగా వస్తూ..

మోపాల్​ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోపాల్​ పోలీస్​స్టేషన్​ పరిధిలోని కంజర గ్రామంలో రైస్​మిల్​ సమీపంలో గడ్డిలోడ్​తో ఉన్న ట్రాక్టర్​ కంజర గ్రామంలోకి వెళ్తోంది. అదే సమయంలో గ్రామం నుంచి బైక్​పై రోడ్డుపైకి వస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్​, బైక్​ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో బైక్​పై ఉన్న ఇద్దరు వ్యక్తులు మనోజ్​, రాజు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న మోపాల్​ పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్​కు తరలించిన మోపాల్​ ఎస్సై సుష్మిత కేసును దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆడవారి మనోవేదన పట్టదా.. పోలీసులు ఇబ్బందులకు గురిచేశారు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *