Cockfighting Kamareddy | కోడి పందేలు ఆడుతున్న పలువురి అరెస్ట్

కోడి పందేలు ఆడుతున్న పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Cockfighting Kamareddy | కోడి పందేల సంస్కృతి కామారెడ్డి జిల్లాకు (Kamareddy Police) పాకింది. పలువురు రూ.వేలల్లో బెట్టింగ్​లు పెడుతున్నారు. సదాశివనగర్ (Sadashivanagar) మండలంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు మెరుపు దాడులు చేసి పలువురిని అరెస్ట్ చేశారు.

Cockfighting Kamareddy | తిర్మన్​పల్లిలో..

సదాశివనగర్ మండలం తిర్మన్‌పల్లి గ్రామంలో భారీగా కోడిపందేలు జరుగుతున్నాయన్న పక్కా సమాచారంతో సదాశివనగర్ పోలీసులు కామారెడ్డి సీసీఎస్ పోలీసుల సహకారంతో దాడి చేశారు. 12 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. అక్కడి నుంచి 9 బైక్‌లు, 3 కార్లు, 11 సెల్‌ఫోన్లు, 65 కత్తులు రూ.45,050 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో మండలంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ కోడిపందేలు, జూదం వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతామని, ఇకపై ఇలాంటి వాటిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి: Toxic Trailer Review | టాక్సిక్ ట్రైలర్ రివ్యూ : నాలుగు నిమిషాల్లో పిచ్చెక్కించిన టాక్సిక్ వరల్డ్

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *