అక్షరటుడే, కామారెడ్డి: Har Ghar Tiranga Kamareddy | స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని కామారెడ్డి(Kamareddy) ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి (Katipally Venkata Ramana Reddy) పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగాలో భాగంగా భాగంగా ఆయన క్యాంప్ కార్యాలయంపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
Har Ghar Tiranga Kamareddy |వారి స్ఫూర్తిని అందించేందుకు..
ప్రధాని మోదీ పిలుపు మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాల స్ఫూర్తిని నేటి తరానికి అందించేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలని కేవీఆర్ పేర్కొన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన యోధులను గుర్తు చేసుకుంటూ, ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటుకోవాలని కోరారు.
ఇది కూడా చదవండి: తైవాన్‌లోని న్యూ తైపీ సిటీ, టామ్సుయ్ జిల్లా, డాన్హై న్యూ టౌన్ పైన అద్భుతమైన ఏర్పడిన సుడిగాలి