అక్షరటుడే, మెండోరా: Sriramsagar Project | జిల్లాకు జీవనాడి అయిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం ఖరీఫ్‌లో ఆశలు పెంచుతోంది. ఎగువ కురుస్తున్న వర్షాలతో జలాశయంలో నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది.
Sriramsagar Project | ఎగువన కురుస్తున్న వర్షాలతో..
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో మెండోరా మండలం (Mendora Mandal)లోని పోచంపాడ్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం ఉదయం 9 గంటల సమయానికి ప్రాజెక్టులోకి 21,438 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు అవుతున్నట్లు అధికారులు తెలిపారు. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు నుంచి వరద నీరు విడుదల కావడంతో పాటు విష్ణుపురి, బాలేగావ్ ప్రాజెక్టులు దాదాపు 99 శాతం నిండిన నేపథ్యంలో శ్రీరాంసాగర్‌కు వరద కొనసాగుతోంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,091 అడుగులు, పూర్తి సామర్థ్యం 80.50 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1,077.30 అడుగుల వద్ద 38.41 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
Sriramsagar Project | ప్రాజెక్ట్ నుంచి కాలువలకు..
ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు వదులుతున్నారు. ఆవిరి రూపంలో 443 క్యూసెక్కులు పోతుంది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతుండటంతో ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతుండగా, శ్రీరాంసాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులు ఖరీఫ్ సాగుకు అనుకూల పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఇది కూడా చదవండి..: House Theft Case | చోరీ కేసును ఛేదించిన పోలీసులు..అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్