House Theft Case | చోరీ కేసును ఛేదించిన పోలీసులు..అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్

ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో అంతర్రాష్ట్ర నేరగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి : House Theft Case | ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో అంతర్రాష్ట్ర నేరగాడిని పోలీసులు (Kamareddy Police) అరెస్ట్ చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) బుధవారం వివరాలు వెల్లడించారు.

House Theft Case | కాకతీయ నగర్​కు చెందిన..

గత నెల 19న కాకతీయ నగర్‌కు చెందిన గంగాధర్ తన కుటుంబంతో కలిసి గంభీరావుపేటలో జరుగుతున్న శుభకార్యానికి వెళ్లారు. 20న ఉదయం ఇంటికి తిరిగి వచ్చి చూడగా తాళాలు పగులగొట్టి ఉండటంతో అనుమానం వచ్చింల్ ఇంట్లోకి వెళ్లి చూడగా 3 బీరువాలు తెరిచి ఉండటం, సామాను చిందరవందరగా ఉండటం గమనించారు. బీరువాల్లోని 4 తులాల బంగారు ఆభరణాలు, 60 తులాల వెండి వస్తువులు, కొంత నగదు చోరీకి గురైనట్లు గుర్తించి దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే 3 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టాయి. సీసీటీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, స్థానిక సమాచారం ఆధారంగా చోరీకి గురైన బంగారాన్ని విక్రయించేందుకు నిందితుడు కామారెడ్డికి వస్తున్నట్లు సమాచారం అందడంతో టెక్రియాల్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు.

House Theft Case | పోలీసులను చూసి పారిపోతూ..

పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించిన నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో అతను గుంటూరు పట్టణానికి చెందిన చెరుకూరి విశ్వనాథ్ ఫణికాంత్ రెడ్డి @ లక్ష్మీనారాయణగా తేలింది. అతను అంతర్రాష్ట్ర నేరగాడని, ఇప్పటికే తెలంగాణలో ఎల్బీనగర్, జవహర్‌నగర్, నాచారం, శంకర్‌పల్లి తదితర చోట్ల 15 కేసులు, ఏపీలో నూజివీడు, కందుకూరు, ఒంగోలు, విజయవాడ, తాడేపల్లిగూడెం పోలీస్ స్టేషన్లలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి వద్ద నుంచి 3.5 తులాల బంగారు నల్లపూసల దండ, 0.5 తులా బంగారు ఉంగరం, 20 తులాల వెండి గొలుసులు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసు ఛేదనలో పనిచేసిన పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

ఇది కూడా చదవండి: UPI Charges | యూపీఐ డిజిటల్ చెల్లింపుల ఖర్చు భరించాల్సిందే: ఆర్‌బీఐ గవర్నర్

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *