అక్షరటుడే, బోధన్: Cyber Crime Awareness | సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని బోధన్ ఏసీపీ శ్రీనివాస్ (Bodhan Police) అన్నారు. బోధన్(Bodhan) పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన సైబర్ నేరాలపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.
Cyber Crime Awareness | అవాంచిత ఫోన్‌కాల్స్‌కు స్పందించవద్దు
ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ సైబర్ నేరాలపై విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించుకొని వాటిపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అవాంచిత ఫోన్‌కాల్స్‌కు స్పందించవద్దన్నారు. విద్యార్థులు, యువత పార్ట్ టైమ్ జాబ్‌లు, పెట్టుబడుల ఆఫర్లు, అపరిచిత క్యూఆర్ కోడ్‌ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓటీపీ, ఏటీఎం పిన్, సివీవీ, బ్యాంక్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని కోరారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేయాలని లేదా సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ వెంకటనారాయణ, ఎస్సై హబీబ్ ఖాన్, కళాశాల ఛైర్మన్ సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: UPI Charges | యూపీఐ డిజిటల్ చెల్లింపుల ఖర్చు భరించాల్సిందే: ఆర్‌బీఐ గవర్నర్