అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cheyutha Pension Scheme | రాష్ట్ర ప్రభుత్వం (Telangana) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘చేయూత’ పింఛన్ల పథకానికి సంబంధించి కొత్త దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెల 15 వరకు పొడిగించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
Cheyutha Pension Scheme |15 రోజుల గడువు పొడిగిస్తూ..
దరఖాస్తుల నమోదుకు ఆగస్టు 31 ఆఖరు గడువు అని మొదట ప్రభుత్వం తెలిపింది. అర్హులైన పేదలు చివరి నిమిషంలో గ్రామ పంచాయతీలు, వార్డు సచివాలయాలు, ప్రజాపాలన సేవా కేంద్రాలకు క్యూకట్టారు. ఇంకా పెన్షన్లకు అర్హులైన వారు చాలామంది దరఖాస్తులు చేసుకోకపోవడంతో ప్రభుత్వం లబ్ధిదారులు దరఖాస్తు చేసుకునేందుకు మరో 15 రోజుల పాటు అవకాశాన్ని కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంపై ఆశావహులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తులను సైతం క్షేత్రస్థాయిలో డేటా ఎంట్రీ ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది.
Cheyutha Pension Scheme | 12,442మంది దరఖాస్తు
జిల్లాలో (Kamareddy) ఇప్పటివరకు 12,442 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నట్లు డీఆర్డీవో దామోదర్ తెలిపారు. అందులో అత్యధికంగా 7,618 మంది వితంతు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. 1,229 మంది ఒంటరి మహిళలు, 2,953 మంది వికలాంగులు, 179 మంది చేనేత, 448 మంది గీత కార్మికులు పింఛన్ల కోసం ఆగస్టు 31 వరకు దరఖాస్తులు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 4,34,854 దరఖాస్తులు నమోదయ్యాయి.
ఇది కూడా చదవండి: ఆస్టేలియాలో షాకింగ్ ఘటన.. మూడు తొవ్వల దగ్గర దీపం పెట్టిన మహిళ