Congress Government | కాంగ్రెస్ పతనానికి కౌంట్‌డౌన్ మొదలైంది.. రానున్న రోజుల్లో టీఆర్ఎస్ పాలన ఖాయం: కవిత

కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలతోనే సాగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Congress Government | కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలతోనే సాగిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నిలబెట్టుకోలేకపోయిందని ఆమె మండిపడ్డారు. ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.

Congress Government | ప్రభుత్వంపై  విమర్శలు..

ఈ వెయ్యి రోజుల వ్యవధిలో కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా లబ్ధి చేకూర్చింది తప్ప, పేదల బతుకులను మాత్రం బాగు చేయలేదని కవిత ఎద్దేవా చేశారు. హైడ్రా పేరిట పేదల ఇళ్ల కూల్చివేతలు, సంక్షేమ గురుకులాల్లో విద్యార్థుల వరుస మరణాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు రాక నిరుద్యోగ యువత ఆత్మహత్యలు, అన్నదాతల బలవన్మరణాలతో పాటు రాష్ట్రంలో రోజురోజుకూ పెరిగిపోతున్న హత్యలు, నేరాలే రేవంత్ రెడ్డి సర్కార్ సాధించిన అసలైన ప్రగతి అని ఆమె విమర్శించారు.

Congress Government | పతనానికి కౌంట్‌డౌన్ మొదలైంది..

ఉద్యమకారుల నెత్తురు చిందిన నాటి నుంచే కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి కౌంట్‌డౌన్ మొదలైందని, ఈ ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందని కవిత హెచ్చరించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో టీఆర్ఎస్ సర్కారే ఏర్పాటవుతుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న తప్పులను, ప్రజా వ్యతిరేక ఆగడాలను ఎట్టిపరిస్థితుల్లోనూ సాగనివ్వబోమని, ప్రజల పక్షాన నిలబడి చివరి వరకు పోరాటం కొనసాగిస్తామని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇది కూడా చదవండి:  Kashmir BJP Protest | కశ్మీర్​లో బీజేపీ నాయకుల భారీ నిరసన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *