CaratLane 400th Store | దేశవ్యాప్తంగా 400 స్టోర్ల మైలురాయిని చేరుకున్న ‘క్యారెట్‌లేన్’.. చెన్నైలో 16వ షోరూమ్ ప్రారంభం..

టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఓమ్ని-చానెల్ ఆభరణాల బ్రాండ్ క్యారెట్‌లేన్ (CaratLane) భారత్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: CaratLane 400th Store | టాటా గ్రూప్‌నకు చెందిన ప్రముఖ ఓమ్ని-చానెల్ ఆభరణాల బ్రాండ్ క్యారెట్‌లేన్ (CaratLane) భారత్‌లో సరికొత్త రికార్డును నెలకొల్పింది. దేశవ్యాప్తంగా తన 400వ స్టోర్‌ను చెన్నైలోని పళ్లికరనై (వెలచేరి మెయిన్ రోడ్డు)లో ఘనంగా ప్రారంభించింది. కస్టమర్లకు సమకాలీన ఫైన్ జ్యువెలరీని మరింత చేరువ చేసే లక్ష్యంతో సంస్థ చేపట్టిన రిటైల్ విస్తరణలో ఇది ఒక కీలక మైలురాయిగా నిలిచింది.

CaratLane 400th Store | సరికొత్త షాపింగ్ అనుభవం..

క్యారెట్‌లేన్ తాజా రిటైల్ ఫార్మాట్‌తో రూపొందించిన ఈ కొత్త షోరూమ్, గ్రౌండ్ ఫ్లోర్‌లో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో కొలువుదీరింది. పళ్లికరనై , చుట్టుపక్కల ప్రాంతాల వినియోగదారులకు ఆధునిక షాపింగ్ అనుభూతిని అందించేలా దీనిని తీర్చిదిద్దారు. ఈ స్టోర్‌లో ప్రముఖ ‘ధ్రువ (Dhruva)’ కలెక్షన్‌తో పాటు ప్రతి వేడుకకు, ప్రతి శైలికి సరిపోయే విస్తృత శ్రేణి సమకాలీన వజ్రాభరణాలు (డైమండ్ జ్యువెలరీ) అందుబాటులో ఉన్నాయి.

CaratLane 400th Store | బలపడుతున్న బ్రాండ్ ఉనికి..

ఈ నూతన షోరూమ్ ప్రారంభంతో క్యారెట్‌లేన్ దక్షిణాది మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. తాజా స్టోర్‌తో కలిపి ఒక్క చెన్నై నగరంలోనే సంస్థకు 16 స్టోర్లు ఏర్పాటయ్యాయి. ఇక తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 38కి చేరగా, వ్యూహాత్మకంగా ఎంతో కీలకమైన దక్షిణ భారతదేశంలో ఇది 54వ అవుట్‌లెట్‌గా నిలిచింది.

80 శాతం మందికి పైగా వజ్రాభరణాలను చేరువ చేయడమే లక్ష్యం: సౌమెన్ భౌమిక్
ఈ సందర్భంగా క్యారెట్‌లేన్ మేనేజింగ్ డైరెక్టర్ సౌమెన్ భౌమిక్ (Saumen Bhaumik) మాట్లాడుతూ.. సంస్థ 18వ వార్షికోత్సవం జరుపుకుంటున్న ఈ ఏడాదిలోనే 400 స్టోర్ల మైలురాయిని అందుకోవడం ఎంతో గర్వంగా ఉందన్నారు. “భారతీయ ( India )మహిళల్లో ఇంకా 80 శాతానికి పైగా మంది సహజ వజ్రాల ప్రపంచంలోకి అడుగుపెట్టలేదు. కాబట్టి డైమండ్ జ్యువెలరీని అందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి మాకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. మా ప్రయాణం ప్రారంభమైన చెన్నై నగరంలోనే ఈ 400వ స్టోర్ మైలురాయిని సాధించడం మాకు ఎంతో ప్రత్యేకమైనది” అని ఆయన వివరించారు.

ఇది కూడా చదవండి:  Telangana Fancy Number Rules | వాహనదారులకు అలర్ట్.. ఫ్యాన్సీ నంబర్ల గడువు 30 రోజులకు తగ్గింపు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *