Cyber Crime Awareness | సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు సూచించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Cyber Crime Awareness |సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలనిఎల్లారెడ్డి (Yellareddy) డీఎస్పీ శ్రీనివాస్ రావు సూచించారు. నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు.

Cyber Crime Awareness | డ్రగ్స్​ వినియోగంతో కలిగే అనర్థాలు..

ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకులు, నకిలీ ఆన్‌లైన్ పెట్టుబడుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులకు తెలియజేయవద్దని హెచ్చరించారు. యువత గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలకు బానిస కాకుండా విద్య, క్రీడలు, ఉద్యోగ సాధనపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాన్నే కాకుండా కుటుంబం, సమాజ భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుందని వివరించారు.

Cyber Crime Awareness | చట్టవిరుద్ధ కార్యకలాపాలు గుర్తిస్తే

గ్రామాల్లో గంజాయి, డ్రగ్స్ విక్రయాలు, వినియోగం, అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ ఆన్‌లైన్ గేమింగ్, జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు పోలీసు శాఖకు సహకరించాలని, పోలీసులకు ప్రజలకు మధ్య సమన్వయం ఉంటే నేరరహిత సమాజ నిర్మాణం సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో బొల్లారం సర్పంచ్ ప్రభుగౌడ్, ఉపసర్పంచ్ స్వరూప, గ్రామ పోలీస్ అధికారి సందీప్, నాగిరెడ్డిపేట ఎస్సై భార్గవ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: సాగర్ నీళ్లపైనా ఏపీ దుర్మార్గం 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *