Annapurna Seva Ratham | అన్నపూర్ణ సేవా రథం పోస్టర్​ ఆవిష్కరించిన పీసీసీ చీఫ్

టిపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నపూర్ణ సేవా రథం పోస్టర్​ను ఆవిష్కరించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, కామారెడ్డి: Annapurna Seva Ratham | నిజామాబాద్​ జిల్లా కేంద్రంలో టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ అన్నపూర్ణ సేవా రథం ప్రచార పత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీసీఆర్ ట్రస్ట్ చేపడుతున్న సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు.

Annapurna Seva Ratham | విషాదంలో ఉన్న కుటుంబానికి ఆసరాగా..

నియోజకవర్గం (Kamareddy) లోని అన్ని మండలాలు, గ్రామాల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కుటుంబంలోని వారిని కోల్పోయి విషాదంలో ఉన్న సమయంలో అంతక్రియల కార్యక్రమానికి వచ్చే బంధుమిత్రులకు భోజనం ఏర్పాటు చేయడం కోసం జీసీ​ఆర్ ట్రస్ట్ (GCR Trust) ముందుకు రావడం అభినందనీయమని పీసీసీ చీఫ్ అన్నారు. సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఈ సేవా కార్యక్రమాలు మరింత విస్తృతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ మాజీ ఛైర్​పర్సన్ గడ్డం ఇందుప్రియ, డీసీసీ ఉపాధ్యక్షుడు పంపరి లక్ష్మణ్, జూలూరి సుధాకర్, తాటి ప్రసాద్, జమీల్, సలీం, చింతల రవీందర్ గౌడ్, చాట్ల వంశీ, పిడుగు సాయిబాబా, రంగా రమేష్ గౌడ్, సునీల్ గౌడ్, బండారి శ్రీకాంత్, అరవింద్, బల్ల శ్రీనివాస్ పాల్గొన్నారు.

దీనిని కూడా చదవండి : Cigarette Price Hike | మళ్లీ పెరిగిన సిగరెట్​ ధరలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *