అక్షరటుడే, వెబ్డెస్క్ : ACB Raids | మరో అవినీతి తిమింగలం ఏసీబీ (ACB) వలకు చిక్కింది. తన ఉద్యోగాన్ని అడ్డు పెట్టుకొని భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన ఇరిగేషన్ డిప్యూటీ ఇంజినీర్ నివాసాల్లో అధికారులు గురువారం సోదాలు నిర్వహించారు.
నాగర్ కర్నూల్ జిల్లా ఇరిగేషన్ అండ్ సీఏడీ శాఖ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సత్యనారాయణ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో ఏసీబీ అధికారులు ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేశారు. ఈ మేరకు గురువారం ఉదయం ఆయన నివాసంతో పాటు మిత్రులు, బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టారు. ఏకకాలంలో 10 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, నాగర్ కర్నూల్లోని సత్యనారాయణ ఇళ్లలో సోదాలు కొనసాగుతున్నాయి.
ACB Raids | భారీగా ఆస్తులు
సత్యనారాయణ భారీ మొత్తంలో అక్రమాస్తులు కూడబెట్టినట్లు అధికారులు గుర్తించారు. ఆస్తులకు సంబంధించి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. అంతేగాకుండా బంగారం, నగదు సీజ్ చేశారు. సోదాలు పూర్తయ్యాక పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు.
దీనిని కూడా చదవండి : Shekhar Master | శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం