Shekhar Master | శేఖర్​ మాస్టర్​ కారుకు ప్రమాదం

ప్రముఖ కొరియోగ్రాఫర్​ శేఖర్​ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును ట్రక్​ ఢీకొంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Shekhar Master | ప్రముఖ కొరియోగ్రాఫర్​ శేఖర్​ మాస్టర్​ కారు ప్రమాదానికి గురైంది. ఆయన ప్రయాణిస్తున్న కారును ట్రక్​ ఢీకొంది. ఈ ఘటనలో శేఖర్​ మాస్టర్​ సురక్షితంగా బయటడ్డారు.

మెగాస్టార్​ చిరంజీవి నటిస్తున్న కాక మూవీ షూటింగ్​ ప్రస్తుతం శంషాబాద్​ సమీపంలోని ముచ్చింతల్​లో జరుగుతోంది. ఆ సినిమా షూటింగ్​ ముగించుకొని శేఖర్​ మాస్టర్​ హైదరాబాద్​ తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. శంషాబాద్​ సమీపంలో ఆయన కారును పండ్ల లోడ్​తో వెళ్తున్న ట్రక్​ వెనుక నుంచి ఢీకొంది.

Shekhar Master | కారుపై పడిపోయిన ట్రక్​

ఈ ప్రమాదంలో అతివేగంగా వచ్చిన ట్రక్​ అదుపు తప్పి కారును ఢీకొంది. అనంతరం కారుపై పడిపోయింది. ఆ సమయంలో శేఖర్​ మాస్టర్​తో పలువురు సిబ్బంది సైతం కారులోనే ఉన్నారు. వారందరు సురక్షితంగా బయటపడ్డారు. కారు వెనుక భాగం తీవ్రంగా ధ్వంసం అయింది. ఆయన సురక్షితంగా బయటపడటంతో కుటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ వర్గాలు, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

దీనిని కూడా చదవండి : Central Govt Laptop Scheme | కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు రూ. లక్ష 80 వేల ల్యాప్‌ టాప్‌లు..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *