సినిమాMega 158 Launch | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మెగా 158 గ్రాండ్ స్టార్ట్.. మెగా...

Mega 158 Launch | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మెగా 158 గ్రాండ్ స్టార్ట్.. మెగా అభిమానులకు ఫుల్ ట్రీట్ ఇచ్చిన లాంచ్ ఈవెంట్!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక ‘మెగా 158’ చిత్రం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Mega 158 Launch | హైదరాబాద్‌ (Hyderabad)లో మెగా అభిమానులను ఉత్సాహంతో నింపేసిన ఓ భారీ సినీ వేడుక ఘనంగా జరిగింది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక 158వ చిత్రం అధికారికంగా ప్రారంభమైంది. ప్రస్తుతం తాత్కాలికంగా ‘మెగా 158’గా పిలుస్తున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన లాంచ్ ఈవెంట్ అత్యంత వైభవంగా నిర్వహించారు. మెగాస్టార్ సినిమా అంటేనే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి.

అలాంటిది చిరంజీవి (Megastar Chiranjeevi) కెరీర్‌లో మరో భారీ చిత్రం ప్రారంభం కావడంతో ఈ వేడుకపై అందరి దృష్టి పడింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు కొల్లి బాబీ (Director Kolli Bobby)తో పాటు చిత్ర బృందం సభ్యులు, సినీ ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేదిక మొత్తం మెగా అభిమానుల సందడితో కళకళలాడిపోయింది. ఈ సినిమా ప్రారంభ వేడుకను కేవలం పూజా కార్యక్రమంగా కాకుండా, ఒక ప్రత్యేక సినీ వేడుకలా మేకర్స్ నిర్వహించడం ఆకట్టుకుంది.

Mega 158 Launch | క్లాప్ కొట్టిన ప‌వ‌న్..

ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ప‌వ‌న్ క‌ళ్యాణ్ . ఆయన స్వయంగా క్లాప్ కొట్టి సినిమాను అధికారికంగా ప్రారంభించడం అభిమానుల్లో మరింత జోష్ నింపింది. పవన్ కళ్యాణ్ క్లాప్ ఇవ్వగానే వేదిక మొత్తం కేరింతలతో మార్మోగిపోయిందని చెప్పాలి. సోషల్ మీడియాలో కూడా ఈ వీడియోలు, ఫొటోలు వేగంగా వైరల్ అవుతున్నాయి. మరోవైపు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన రామ్ చ‌ర‌ణ్ ఈ వేడుకకు హాజరుకాలేకపోవడం కొంత నిరాశ కలిగించింది. అయితే మిగతా మెగా కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొనడంతో ఈవెంట్‌కు ప్రత్యేక ఆకర్షణ ఏర్పడింది.

Mega 158 Launch | భారీ బడ్జెట్​తో..

ఈ భారీ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడ‌క్ష‌న్స్ (KVN Productions) అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. సాంకేతికంగా కూడా సినిమా అత్యున్నత ప్రమాణాలతో రూపొందించేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా విషయంలో అభిమానుల్లో అంచనాలు పెరగడానికి మరో ప్రధాన కారణం ఉంది. గతంలో చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వచ్చిన వాల్తేరు వీర‌య్య బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని అందుకుంది. మాస్ ఎలిమెంట్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆ సినిమా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు అదే కాంబినేషన్ మళ్లీ రిపీట్ కావడంతో ‘మెగా 158’పై భారీ హైప్ ఏర్పడింది.

ఇది కూడా చదవండి..: Suniel Narang Resignation| ఫిలిం ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ హఠాత్ రాజీనామా

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు మంత్రివర్గ విస్తరణ.. ఆరు దశాబ్దాల తర్వాత కాంగ్రెస్​కు​ మంత్రి పదవులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Tamil Nadu Cabinet Expansion | తమిళనాడు ముఖ్యమంత్రి...

Oil Tankers in Hormuz  | భారత్ సాహసం.. హార్ముజ్ జలసంధిలోకి చమురు నౌకలు!

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oil Tankers in Hormuz  | పశ్చిమాసియాలో నెలకొన్న...

Bus Stone Attack | బస్సు ఆపలేదని రాయితో దాడి.. కేసు నమోదు చేసిన పోలీసులు

అక్షరటుడే, కామారెడ్డి: Bus Stone Attack | బస్సు ఆపడం లేదని...

Deloitte Visakhapatnam | విశాఖకు మరో ఐటీ దిగ్గజం.. డెలాయిట్ ఎంట్రీకి సన్నాహాలు.. ఐటీ హబ్‌గా దూసుకెళ్తున్న సాగర నగరం

అక్షరటుడే, వెబ్​డెస్క్: Deloitte Visakhapatnam | ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లోని విశాఖపట్నం...