అక్షరటుడే, వెబ్డెస్క్: NTR Dragon Shoot | భుజం గాయంతో విశ్రాంతి తీసుకుంటున్న స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ త్వరితగతిన కోలుకుంటున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయన రెస్ట్ మోడ్లో ఉన్నప్పటికీ, ఎన్టీఆర్ నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా షూటింగ్ మాత్రం ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతున్నట్లు సమాచారం.
NTR Dragon Shoot | ఇతర సన్నివేశాలు..
ఎన్టీఆర్ పాల్గొనాల్సిన సన్నివేశాలను తాత్కాలికంగా వాయిదా వేసి, హీరో అవసరం లేని ఇతర కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో షూటింగ్ షెడ్యూల్కు ఆటంకం కలగకుండా చిత్రబృందం ముందస్తు ప్రణాళికతో పనులు కొనసాగిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యం రోజురోజుకూ మెరుగుపడుతోందని, వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.
పూర్తిగా కోలుకున్న వెంటనే తిరిగి సినిమా సెట్స్లో అడుగుపెట్టి షూటింగ్లో పాల్గొనేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.