Janhvi Kapoor Tirumala | శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్​

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Janhvi Kapoor Tirumala | బాలీవుడ్​ నటి జాన్వీ కపూర్​ గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆమె నటించిన పెద్ది సినిమా (Peddi Movie) గురువారం విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ హిట్ కావాలని ఆమె స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

జాన్వీ కపూర్​ శ్రీవారి భక్తురాలు. ఆమె గతంలో అనేక సార్లు స్వామివారిని దర్శించుకున్నారు. తాజాగా పెద్ది సినిమా విడుదల నేపథ్యంలో బుధవారం అలిపిరి మెట్ల మార్గంలో ఆమె తిరుమల చేరుకున్నారు. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. నటి జాన్వీకపూర్​కు టీటీడీ (TTD) అధికారులు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం చేసి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.

Janhvi Kapoor Tirumala | ‘పెద్ది’కి పాజిటివ్​ టాక్​

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ‘పెద్ది’ సినిమా భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రీమియర్ షోల నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తుండటంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. పెద్ది సినిమాను రాంచరణ్​ సతీమణి ఉపాసన వీక్షించారు. ప్రీమియర్​ షో చూసిన ఆమె అభిమానులతో కలిసి పేపర్లు విసిరారు.

 

దీనిని కూడా చదవండి : Ram Charan Peddi | గ్లోబల్ ‘మెగా’ క్రేజ్: రాంచరణ్ ‘పెద్ది’ సినిమా కోసం వచ్చిన జపనీస్ మహిళలు!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *