Ram Charan Peddi | గ్లోబల్ ‘మెగా’ క్రేజ్: రాంచరణ్ ‘పెద్ది’ సినిమా కోసం వచ్చిన జపనీస్ మహిళలు!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ram Charan Peddi | గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన తాజా చిత్రం ‘పెద్ది’ సృష్టిస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అయితే, ఈ సినిమాపై తమకున్న వీరాభిమానాన్ని చాటుకునేందుకు ఇద్దరు జపనీస్ మహిళలు ఏకంగా టోక్యో నుంచి హైదరాబాద్‌కు తరలిరావడం ఇప్పుడు చిత్రసీమలోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది.

Peddi

Ram Charan Peddi | 3 రోజులు.. 10 సార్లు!

సినిమాపై ఉన్న పిచ్చితో టోక్యోకు చెందిన ఈ ఇద్దరు మహిళలు ప్రత్యేకంగా హైదరాబాద్ చేరుకున్నారు. ఇక్కడి థియేటర్లలో ‘పెద్ది’ సినిమాను కేవలం మూడు రోజుల్లోనే ఏకంగా 10 సార్లు చూడాలని వారు ఒక పక్కా ప్లాన్‌తో వచ్చారు. ఒక విదేశీ నటుడి సినిమాను, అది కూడా భాష తెలియని ప్రాంతానికి వచ్చి ఇన్ని సార్లు చూడాలనుకోవడం వారి అభిమానానికి నిలువెత్తు నిదర్శనం.

Ram Charan Peddi | భాష అడ్డంకి కాదు.. ₹2 లక్షల ఖర్చు!

మన భాష రాకపోయినా, రాంచరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, నటనను ఆస్వాదించడానికి వారు ప్రత్యేకంగా సిద్ధమవడం విశేషం. సినిమా కథను, భావోద్వేగాలను అర్థం చేసుకోవడానికి ముందే కొంత హోంవర్క్ సైతం చేసుకున్నారట. కేవలం థియేటర్ ఎక్స్‌పీరియన్స్ కోసం, తమ అభిమాన హీరో సినిమాను లోకల్ ఆడియన్స్‌తో కలిసి ఎంజాయ్ చేయడం కోసం వారు దాదాపు ₹2 లక్షలు ఖర్చు పెట్టుకుని భారత్​కు రావడం గమనార్హం.

akshara today .jpgpeddi

Ram Charan Peddi | విపరీతమైన ఫ్యాన్ బేస్

ఆర్ఆర్ఆర్ (RRR) సినిమాతో జపాన్‌లో రాంచరణ్‌కు విపరీతమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. ఇప్పుడు ‘పెద్ది’ సినిమా కోసం ఈ స్థాయి క్రేజ్ చూడటం టాలీవుడ్ స్టామినాను మరోసారి నిరూపిస్తోంది.” అని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భాషతో సంబంధం లేకుండా కేవలం కంటెంట్, హీరోల క్రేజ్ చూసి ఖండాలు దాటి వస్తున్న ఇటువంటి అభిమానులను చూసి మెగా ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ జపనీస్ లేడీస్ పిక్స్, వారి ప్లానింగ్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

Peddi Movie Review | రామ్ చరణ్ అదిరిపోయే బాడీ బిల్డింగ్…..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *