Korea Stock Market Rally | దుమ్ము రేపుతున్న కొరియన్ మార్కెట్.. ఏడాదిలో 225 శాతం ర్యాలీ!

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Korea Stock Market Rally | దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ (South Korean Stock Market) రాబడులను ఇస్తోంది. కోస్పీ ఇండెక్స్ ఏడాదిలో డాలర్లతో పోల్చితే ఏడాదిలోనే 226 శాతం పైగా పెరిగింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ర్యాలీల్లో ఒకటి. ఇదే కాలంలో తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 92 శాతం పెరిగి రెండో స్థానంలో ఉంది.

Korea Stock Market Rally | ర్యాలీకి కారణాలు..

కోస్పీ ఏడాది కాలంలో 225 శాతానికిపైగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం కృత్రిమ మేధస్సు, సెమీకండక్టర్ స్టాకుల పనితీరు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) విప్లవంలో దక్షిణ కొరియా చిప్‌మేకర్ల కీలక పాత్ర కారణంగా ఆ దేశ స్టాక్ ఎక్స్ఛేంజ్ కోస్పీ మార్కెట్ క్యాప్ ఏకంగా 1.28 ట్రిలియన్ డాలర్ల నుంచి 4.11 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంది. కాగా కోస్పీ మొత్తం మార్కెట్ క్యాప్ పెరుగుదలలో 57 శాతం పైగా శాంసంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్కే హైనిక్స్ నుంచే ఉండడం గమనార్హం. ఇందులో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ మార్కెట్ క్యాప్ 892 బిలియన్ డాలర్లు, ఎస్కే హైనిక్స్ మార్కెట్ క్యాప్ 734 బిలియన్ డాలర్లు కంట్రిబ్యూట్ చేశాయి.

Korea Stock Market Rally | స్పెక్యులేషన్‌తో పెట్టుబడులు..

ఏఐ బూమ్‌తో ఆయా కంపెనీలలో పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. ఫోమోలో రుణాలను తీసుకుని మరీ పెట్టుబడులు పెడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో కోస్పీలో రికార్డు స్థాయిలో ట్రేడింగ్ వాల్యూమ్‌లు నమోదవుతున్నాయి. భారీ స్పెక్యులేషన్ కారణంగా రోజువారీ ధరలలో 5 శాతం లేదా అంతకంటే ఎక్కువ హెచ్చుతగ్గులు సర్వసాధారణమయ్యాయి. దీంతో దక్షిణ కొరియా బెంచ్‌మార్క్ కోస్పీ ఇండెక్స్ ప్రపంచవ్యాప్తంగా అత్యంత అస్థిరమైన ప్రధాన స్టాక్ సూచికగా మారింది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 18 ఏళ్లలోపు వారి కొత్త డీమాట్ ఖాతాలు దాదాపు 10 రెట్లు పెరిగినట్లు అంచనా.

Korea Stock Market Rally | ఇది బ్రాడ్ ర్యాలీ కాదు..

కోస్పీలో 835 కంపెనీలు నమోదై ఉన్నాయి. ఇందులో 2025 నుంచి 2026 మధ్యలో 207 కంపెనీలు నెగెటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. మరో 600 స్టాకులు ఒక శాతం కంటే తక్కువగా కంట్రిబ్యూట్ చేశాయి. అంటే చాలా కంపెనీలు లాభపడకుండానే ఇండెక్స్ భారీగా పెరిగిందన్న మాట. ఇలాంటి కాన్సంట్రేటెడ్ ర్యాలీలు స్పెక్యులేటివ్ మెనియాను రేకెత్తిస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇన్వెస్టర్లు రిస్క్ తీసుకుని భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐ బూమ్ వల్ల దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ అద్భుతాలు సృష్టిస్తున్నా.. ర్యాలీ కేవలం కొన్ని కంపెనీల పెరుగుదలపైనే ఆధారపడడం వల్ల ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Korea Stock Market Rally | తైవాన్‌లోనూ..

ఏఐ సరఫరా గొలుసులోని కీలక కంపెనీలకు నిలయమైన తైవాన్‌లో కూడా పరిస్థితి ఇలాగే ఉంది. స్టాక్‌లు ఎప్పటికీ పెరుగుతూనే ఉంటాయన్న భావన ప్రజలలో నెలకొంది. దీంతో భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుండడంతో సూచీలు రికార్డు స్థాయి గరిష్టాల వద్ద కొనసాగుతున్నాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Gains | భారీ లాభాల్లో మార్కెట్లు

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *