AI Human Risk | ఏఐ మనుషులను చంపుతుందా.. ఆంత్రోపిక్​ సీఈవో కీలక వ్యాఖ్యలు

ఆంత్రోపిక్ సీఈఓ డారియో అమోడెయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : AI Human Risk | ఆంత్రోపిక్ (Anthropic) సీఈఓ డారియో అమోడెయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏఐ మనుషులను చంపగలదా అని అడిగిన ప్రశ్నకు ఆయన స్పందించారు. మనం సరైన మార్గాన్ని ఎంచుకుంటే తప్పు జరిగే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు. తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటే, ఆ ప్రమాదం చాలా ఎక్కువగా ఉండవచ్చని పేర్కొన్నారు.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శక్తివంతమవుతున్నందున, తగిన భద్రతా చర్యలను అమలు చేయాలని డారియో సూచించారు. AI అభివృద్ధి వేగాన్ని తగ్గించాలన్నారు. ఆంత్రోపిక్ మాజీ పరిశోధకుడు జాకబ్ స్టెయిన్‌హార్ట్ లేవనెత్తిన ఆందోళనలపై అమోడెయ్ స్పందించారు. స్టెయిన్‌హార్ట్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. AIతో కలిగే ప్రమాదాల గురించి ఆయన హెచ్చరించారు. AI మనుషులను చంపగలదా, అటువంటి ఫలితం ఎంతవరకు సంభవించే అవకాశం ఉంది అనే ప్రశ్నకు సమాధానమిస్తూ, తాను స్టెయిన్‌హార్ట్ ఆందోళనలతో ఏకీభవిస్తున్నానని డారియో పేర్కొన్నారు.

AI Human Risk | ప్రభుత్వాల నిర్ణయంపై..

ఈ సాంకేతిక పరిజ్ఞానం పురోగతికి ప్రభుత్వాలు, కంపెనీలు ఎలా స్పందిస్తాయనే దానిపైనే అంతిమ ఫలితం ఆధారపడి ఉంటుందని అభిప్రాయ పడ్డారు. తప్పుడు మార్గాల కంటే సరైన మార్గాలను ఎంచుకోవడంలో మన చొరవ, సామర్థ్యంపై దృష్టి పెడదామన్నారు. ఆంత్రోపిక్, ఓపెన్‌ఏఐ రెండింటిలోనూ పనిచేసిన ఏఐ పరిశోధకుడు జాకబ్ జాక్సన్, మరింత శక్తివంతమైన వ్యవస్థలను అభివృద్ధి చేసే క్రమంలో ప్రముఖ ఏఐ కంపెనీలు ఆమోదయోగ్యం కాని రిస్క్‌లు తీసుకుంటున్నాయని ఆరోపిస్తూ రాజీనామా చేశారు. రాబోయే రోజుల్లో ఏఐ మానవాళికి ముప్పుగా పరిణమించగలదని అభిప్రాయ పడ్డారు. ఈ క్రమంలో ఆంత్రోపిక్​ ఈ విధంగా స్పందించారు.

దీనిని కూడా చదవండి : Abhijit Deepke | శవాల మీద రాజకీయాలు చేయడానికి వచ్చారా?.. అభిజిత్ దీప్కేపై ఇన్‌ఫ్లుయెన్సర్ల వీరంగం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *