Honda NX500 | ఇక క్లచ్‌తో పనిలేకుండా గేర్లు మార్చుకోవచ్చు.. అడ్వెంచర్ బైక్ ను విడుదల చేసిన హోండా

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Honda NX500 | హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle), స్కూటర్ ఇండియా(హెచఎంఎస్ఐ) తన పాపులర్ అడ్వెంచర్ టూరర్ మోడల్ ‘ఎన్ఎక్స్500’ను సరికొత్త ఈ-క్లచ్ టెక్నాలజీతో తీసుకువచ్చింది. దీని ప్రత్యేకత ఏమిటంటే క్లచ్‌తో పనిలేకుండానే గేర్లు మార్చుకోవచ్చు. ఈ టెక్నాలజీ బైక్ రైడింగ్ అనుభవాన్ని సరికొత్తగా మార్చనుంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆటోమేషన్ సాంకేతికతను భారత రైడింగ్ పరిస్థితులకు అనుగుణంగా దీనిని రూపొందించారు. ఈ కొత్త టెక్నాలజీ ట్రాఫిక్‌లో సులభమైన రైడింగ్ అనుభవం అందిస్తుందని, లాంగ్ టూరింగ్‌లో సౌకర్యవంతంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 7,43,900. హోండా బిగ్‌వింగ్ డీలర్‌షిప్‌లలో బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

Honda NX500 | డిజైన్ ..

ఎన్ఎక్స్500 డిజైన్ లో హోండా ప్రత్యేకమైన అడ్వెంచర్ స్టైల్‌ను కొనసాగించింది. ఎత్తైన విండ్స్‌క్రీన్, నకిల్ గార్డ్స్, వైడ్ టైర్స్, బలమైన నిర్మాణం ఆధునిక డిజైన్, స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్లతో ఇది టూరింగ్ ప్రియులకు ఆకర్షణీయమైన ఎంపికగా నిలుస్తుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Honda NX500 | ఇంజిన్ సామర్థ్యం..

ఈ బైక్‌లో 471సీసీ లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఇది 35 కేడబ్ల్యూ ఎట్ ది రేట్ ఆఫ్ 8500 ఆర్పీఎం పవర్ , 43ఎన్ఎం ఎట్ ది రేట్ ఆఫ్ 6500 ఆర్పీఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పాటు క్లచ్ లో మార్పుల వల్ల గేర్ మార్పులు సులభంగా జరుగుతాయి. ఇది సిటీ రైడింగ్ హైవే టూరింగ్ రెండింటికీ అనువైన బలమైన టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Honda NX500 | అదనపు ఫీచర్స్..

5 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. ఇందులో నావిగేషన్, కాల్, మ్యూజిక్ ఫంక్షన్ల కోసం హోండా రోడ్ సింక్ కనెక్టివిటీ ఉంది. ఎల్ ఈడీ లైటింగ్, హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ (హెచ్ఎస్టీసీ) ఉన్నాయి. షోవా USD ఫ్రంట్ ఫోర్క్స్ , ప్రో లింక్ రియర్ సస్పెన్షన్ ఉన్నాయి. ఇవి రఫ్ రోడ్లపై కూడా స్థిరమైన రైడింగ్ అనుభవాన్ని ఇస్తాయి.
బ్రేకింగ్ సిస్టమ్‌లో ఫ్రంట్ 296 ఎంఎం డ్యుయల్ డిస్క్ , 240 ఎంఎం డిస్క్ బ్రేక్స్ తో డ్యుయల్ చానల్ ఏబీఎస్ ఉన్నాయి.

రెండు రంగుల్లో : ఈ బైక్ మట్టె గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్, పర్ల్ హోర్పుిన్ వైట్ రంగుల్లో అందుబాటులో ఉంది.

ఇది కూడా చదవండి..: Indulekha Hair Serum|జుట్టు రాలే సమస్యకు సైంటిఫిక్ సొల్యూషన్.. ఇందులేఖ క్లినికల్ ట్రయల్స్ సక్సెస్!

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *