Zomato Profits Growth | జొమాటో ‘ఎటెర్నల్’ జోరు.. నాలుగింతలు పెరిగిన కంపెనీ ప్రాఫిట్స్!

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Zomato Profits Growth | ఫుడ్ డెలివరీ దిగ్గజం జొమాటో , క్విక్ కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్లింకిట్‌(Blinkit) లను నిర్వహిస్తున్న ‘ఎటెర్నల్’ (Eternal) సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను సాధించింది. మార్చితో ముగిసిన క్వార్టర్‌లో కంపెనీ లాభాలు ఏకంగా నాలుగింతలకు పైగా పెరిగి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచాయి. గతేడాది ఇదే సమయంలో రూ.39 కోట్లుగా ఉన్న నికర లాభం, ఈ ఏడాది ఏకంగా రూ.174 కోట్లకు చేరి సరికొత్త రికార్డు సృష్టించింది.

Zomato Profits Growth | గతేడాదితో పోలిస్తే..

కంపెనీ ఆదాయం గతేడాదితో పోలిస్తే భారీగా పెరిగింది. గత ఏడాది రూ.5,833 కోట్లుగా ఉన్న ఆదాయం, ఈసారి ఏకంగా రూ.17,292 కోట్లకు ఎగబాకింది. అయితే, వ్యాపార విస్తరణ నేపథ్యంలో కంపెనీ ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరిగాయి. క్రితం ఏడాది రూ.6,104 కోట్లుగా ఉన్న వ్యయాలు, ఈ త్రైమాసికంలో రూ.17,406 కోట్లకు చేరినట్లు సంస్థ వెల్లడించింది.

బ్లింకిట్ (Blinkit): క్విక్ కామర్స్ విభాగంలో బ్లింకిట్ తిరుగులేని వృద్ధిని కనబరిచింది. దీని నెట్ ఆర్డర్ వాల్యూ (NOV) ఏడాది ప్రాతిపదికన 95.4 శాతం పెరిగింది. ఈ ఒక్క త్రైమాసికంలోనే కొత్తగా 216 స్టోర్లను ప్రారంభించగా, మొత్తం స్టోర్ల సంఖ్య 2,243కి చేరుకుంది.

జొమాటో (Zomato): ఫుడ్ డెలివరీ విభాగం 18.8 శాతం వృద్ధితో నిలకడగా రాణిస్తోంది. దీని సవరించిన ఎబిటా (EBITDA) రూ.532 కోట్లుగా నమోదైంది.

డిస్ట్రిక్ట్ (District): పేటీఎం నుంచి కొనుగోలు చేసిన టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ‘డిస్ట్రిక్ట్’ ఆదాయం కూడా 46.5 శాతం పెరిగింది. ముఖ్యంగా దీని నష్టాలు రూ.121 కోట్ల నుండి రూ.81 కోట్లకు తగ్గడం గమనార్హం. మొత్తానికి జొమాటో తన అనుబంధ సంస్థల సహకారంతో మార్కెట్‌లో తన పట్టును మరింత పటిష్టం చేసుకుంటోంది.

ఇది కూడా చదవండి : Stock Market Losses | మళ్లీ నష్టాల బాట..

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *