నిజామాబాద్Self Stage Capture System | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టం...

Self Stage Capture System | ఇందిరమ్మ ఇళ్ల పథకంలో సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టం : కలెక్టర్​

ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంలో ‘సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టం’ను అమలు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ విధానం ద్వారా లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ దశలను వారే స్వయంగా మొబైల్ ఫోన్ ద్వారా ఫొటోలు తీసి పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉందన్నారు.

అక్షరటుడే, ఇందూరు: Self Stage Capture System | ఇందిరమ్మ ఇళ్ల (Indiramma Houses) నిర్మాణ పథకంలో ప్రభుత్వం ‘సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టం’ను అమలు చేస్తోందని కలెక్టర్ ఇలా త్రిపాఠి(Collector Ila Tripathi) తెలిపారు. ఈ విధానం ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తమ ఇంటి నిర్మాణ దశలను వారే స్వయంగా మొబైల్ ఫోన్ ద్వారా ఫొటోలు తీసి, ప్రభుత్వ పోర్టల్‌లో అప్‌లోడ్ చేసే అవకాశం ఉంటుందన్నారు.

Self Stage Capture System |అధికారులతో సమీక్ష..

కలెక్టరేట్​లో ఎంపీడీవోలు, తహశీల్దార్లు, హౌసింగ్ ఏఈలతో (Housing Department) మంగళవారం కలెక్టర్​ సమీక్ష నిర్వహించారు. సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ విధానంపై చర్చించారు. క్షేత్రస్థాయిలో లబ్దిదారులకు ఈ విధానంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. ఈ విధానంలో ఇందిరమ్మ లబ్ధిదారులు పునాది దశ, గోడల నిర్మాణం, పైకప్పు, పూర్తి స్థాయిలో నిర్మాణం వంటి నాలుగు దశలలోనూ ఫొటోలను వారే స్వయంగా తీసి ఇందిరమ్మ ఇల్లు పోర్టల్​లో అప్‌లోడ్ చేసే వెసులుబాటు కల్పించారని వివరింఆరు. ఇవి సంబంధిత అధికారులకు నేరుగా చేరి, నిర్మాణ పనుల పురోగతిని వేగంగా పరిశీలించేందుకు ఉపయోగపడుతాయన్నారు. సంబంధిత పంచాయతీ కార్యదర్శి, వార్డు అధికారి, హౌసింగ్ అధికారి వచ్చే వరకు వేచి చూడాల్సిన అవసరం లేకుండా లబ్ధిదారులే సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టమ్ ద్వారా అప్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

Self Stage Capture System | కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేకుండా..

ఈ విధానంతో లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిభారం ఉండదని, నిర్మాణ దశల ధృవీకరణ వేగవంతం అవుతుందని కలెక్టర్​ తెలిపారు. నిధుల విడుదలలో అనవసర జాప్యం తగ్గుతుందన్నారు. అన్నింటికి మించి ఈ పథకం అమలులో పారదర్శకత పెరుగుతుందని చెప్పారు. లబ్ధిదారులు సెల్ఫ్ స్టేజ్ క్యాప్చర్ సిస్టమ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి: SSC Results | విద్యార్థులకు అలెర్ట్​.. వాట్సాప్​లో పదో తరగతి ఫలితాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల బీభత్సం.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దోపిడీ దొంగలు బీభత్సం...

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...