అక్షరటుడే, వెబ్‌డెస్క్ : SSC Results | తెలంగాణలో పదో తరగతి (Tenth Results) ఫలితాలు బుధవారం మధ్యాహ్నం విడుదల కానున్నాయి. అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ (WhatsApp) ద్వారా కూడా విద్యార్థులు తమ ఫలితాలు తెలుసుకోవచ్చు.
తెలంగాణ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ సర్వీస్ డెలివరీ (ESD) విభాగం పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలను మీ సేవ వాట్సాప్/చాట్‌బాట్ ప్లాట్‌ఫామ్‌లో అందిస్తుందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు తమ ఫలితాలను బుధవారం మధ్యాహ్నం 2:30 గంటల నుండి వాట్సాప్ ద్వారా వెంటనే పొందవచ్చు.
SSC Results | సులభంగా..
పదో తరగతి పరీక్షలకు హాజరైన విద్యార్థులు మీ సేవ వాట్సాప్ నంబర్ 8096958096 ద్వారా తమ ఫలితాలను పొందవచ్చు. దీంతో వెబ్‌సైట్లలో ట్రాఫిక్ సమస్యలు లేకుండా, వేగంగా, అత్యంత సులభంగా రిజల్ట్స్ వస్తాయి. సాధారణంగా ఫలితాలు వెలువడిన వెంటనే చాలా మంది వెబ్సైట్లో చెక్ చేస్తారు. సర్వర్లపై ఒత్తిడి పడి ఎర్రర్ వస్తుంది. ఈ సమస్య లేకుండా డైరెక్ట్‌గా వాట్సాప్‌లో ఫలితాలు చూసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
SSC Results | ఇలా చేయాలి
విద్యార్థులు 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి. వాట్సాప్ ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపాలి. అనంతరం “SSC Result” అని టైప్ చేస్తే మెనులో Open Service అనే ఆప్షన్ వస్తుంది. దానిని క్లిక్ చేసి హాల్ టికెట్ (Hall Ticket) నంబర్ ఎంటర్ చేస్తే రిజల్ట్స్ వస్తాయి. కాగా తెలంగాణ (Telangana)లో మార్చి 14న ప్రారంభమైన టెన్త్ ఎగ్జామ్స్ ఏప్రిల్ 13న ముగిశాయి. మొత్తం 5.15 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు అయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం గతంలోనే ముగిసింది. ఈ క్రమంలో బుధవారం ఫలితాలు విడుదల కోసం పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఇది కూడా చదవండి : CCTV Hacking Allegations | మా సీసీ కెమెరాలు హ్యాక్ చేస్తున్నారు.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు


[…] […]
[…] […]