అక్షరటుడే, వెబ్‌డెస్క్: T-Fiber Internet | అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ (ABP) కింద తెలంగాణ రాష్ట్రంలో టీ-ఫైబర్ ప్రాజెక్టు అమలుపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
T-Fiber Internet | గ్రామ పంచాయతీ రింగ్ నెట్‌వర్క్ ఆస్తుల బదిలీ
అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రాం సజావుగా అమలు చేసే దిశగా ముఖ్యమంత్రి కొన్ని కీలక అంశాలను సింధియా దృష్టికి తీసుకువెళ్లారు. అమలుకు సంబంధించిన ఒప్పందాన్ని త్వరితగతిన కుదుర్చుకోవడం, పెండింగులో ఉన్న నిధుల విడుదలను వేగవంతం చేయడం పై చర్చించారు.
మండలం నుంచి గ్రామ పంచాయతీ రింగ్ నెట్‌వర్క్ ఆస్తులను డిజిటల్ భారత్ నిధికి బదిలీ చేయడంపై స్పష్టమైన విధానం ఏర్పాటు చేయడం పైనా కేంద్ర మంత్రి సింధియాతో ప్రస్తావించారు.
వీటిపై సింధియా సానుకూలంగా స్వీకరించారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఐటీ శాఖ జాయింట్ సెక్రటరీ అనుదీప్, ఉన్నతాధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
T-Fiber Internet | ప్రతి ఇంటికి బలమైన హై-స్పీడ్ ఇంటర్నెట్
ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి బలమైన హై-స్పీడ్ ఇంటర్నెట్ అందించాలనే తెలంగాణ దార్శనికతపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ లక్ష్యం సాధించడానికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని హామీ ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్ర కోసం భవిష్యత్తును తీర్చిదిద్దే బలమైన నెట్‌వర్క్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటును రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడం, కేంద్రం తో ఒప్పందం కుదుర్చుకోవడంతో, నిజమైన డిజిటల్ తెలంగాణకు పునాది పడనుంది.
రాష్ట్రంలో ఏకీకృత డిజిటల్ వెన్నెముక వైపు నిర్ణయాత్మకంగా ముందుకు సాగుతోంది. టీ-ఫైబర్ నెట్‌వర్క్ ప్రతి గ్రామ పంచాయతీని రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా అనుసంధానించనుంది.
T-Fiber Internet | ప్రత్యామ్నాయ మార్గం ద్వారా నిరంతర సేవలు
రింగ్ ఆర్కిటెక్చర్ ద్వారా ఒక మార్గంలో అంతరాయం ఏర్పడిన కూడా.. ప్రత్యామ్నాయ మార్గం ద్వారా సేవలు నిరంతరం కొనసాగుతాయి. తద్వారా గ్రామీణ తెలంగాణకు నిజమైన నిరంతర హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ అందనుంది.
మొదటి దశలో దెబ్బతిన్న నెట్‌వర్క్ ఉన్న ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లోని 3,089 గ్రామాలకు డిజిటల్ కనెక్టివిటీ పునరుద్ధరణ చేపట్టనున్నారు.
అమెండేడ్ భారత్‌నెట్ ప్రోగ్రామ్ కింద ఈ గ్రామాలను ఆధునిక, భవిష్యత్తు అవసరాలకు సరిపడే ఫైబర్ మౌలిక సదుపాయాలతో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలతో సమానంగా అనుసంధానిస్తారు.
ACB RTA Raids | ఆర్‌టీఏ కార్యాలయాల్లో ఏసీబీ మెరుపుదాడులు.. బట్టబయలైన బ్రోకర్ల దందా!


