SI Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై

లంచం తీసుకుంటూ టోలిచౌకి ఎస్సై పాండు నాయక్​ ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా దొరికాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SI Caught by ACB | లంచం తీసుకుంటూ ఓ ఎస్సై ఏసీబీ (ACB) అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా దొరికాడు. ఒక వ్యక్తిపై కేసు నమోదు కాకుండా ఆపడం, కుటుంబ వివాదాన్ని పరిష్కరించడం, పాస్‌పోర్ట్ జప్తు కాకుండా చూడటం కోసం టోలీచౌకి ఎస్సై (Tolichowki SI) ఆర్​ పాండు నాయక్​ రూ.10 వేల లంచం డిమాండ్​ చేశారు.

రాష్ట్రంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పోలీస్​ శాఖలో సైతం పలువురు భారీగా లంచాలు తీసుకుంటున్నారు. ఇటీవల ఏసీబీ దాడుల్లో పలువురు పోలీసులు చిక్కుతుండటం ఇందుకు నిదర్శనం. తాజాగా గోల్కొండ జోన్ పరిధిలోని టోలీచౌకీ పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ (SI) ఆర్. పాండు నాయక్‌ను ఓ కుటుంబ వివాదం పరిష్కరించడానికి లంచం డిమాండ్​ చేశాడు. కేసు నమోదు చేయకపోవడం, కుటుంబ వివాదాన్ని పరిష్కరించడంలో సహాయపడటం, పాస్‌పోర్ట్‌ను తిరిగి ఇవ్వడం వంటి పనుల కోసం ఆయన లంచం అడిగారు.

SI Caught by ACB | తల్లి ఫిర్యాదు మేరకు..

ఎస్సై లంచం అడగడంతో బాధితుడి తల్లి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు ఎస్సై పాండు నాయక్​ లంచం తీసుకుంటుండగా మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం పోలీస్​ స్టేషన్​లో సోదాలు చేశారు. ఎస్సైని అరెస్ట్ అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని జ్యుడీషియల్ రిమాండ్ కోసం నాంపల్లిలోని ACB కేసుల ప్రత్యేక న్యాయస్థానం ముందు అతన్ని హాజరు పరుస్తామని తెలిపారు. ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని సూచించారు.

దీనిని కూడా చదవండి : Konda Surekha | కొండా సురేఖపై చర్యలుంటాయా.. ఢిల్లీలో సీఎం బిజీ

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *