అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telangana Tahsildars Transfer | రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం, అవసరాల దృష్ట్యా రెవెన్యూ శాఖలో కీలక బదిలీలు జరిగాయి. వివిధ జిల్లాల్లో పనిచేస్తున్న 12 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
వీరికి డిస్ట్రిక్ట్ రెవెన్యూ ఆఫీసర్లు (DRO), స్పెషల్ కలెక్టర్ పర్సనల్ అసిస్టెంట్లు (Special Collector PA), స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు (SDC)గా పదోన్నతులు/బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Telangana Tahsildars Transfer | తక్షణమే బాధ్యతలు
బదిలీ అయిన అధికారులను తక్షణమే నూతన స్థానాల్లో బాధ్యతలు స్వీకరించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికల నిబంధనలు, పరిపాలనా అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ బదిలీలు చేపట్టినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
బదిలీల పూర్తి వివరాలు, ఏ అధికారిని ఏ స్థానానికి బదిలీ చేశారనే నియామక పత్రాల (Orders) కాపీలను ఆయా జిల్లాల కలెక్టరేట్లకు, సంబంధిత అధికారులకు ఇప్పటికే చేరవేసినట్లు రెవెన్యూ శాఖ పేర్కొంది.
Telangana Tahsildars Transfer | బదిలీ అయిన అధికారులు – కొత్త పోస్టింగులు
మేడ్చల్-మల్కాజిగిరి నుంచి J. స్వామి → కరీంనగర్ DRO
నాగర్‌కర్నూల్ నుంచి A. పాండు → కామారెడ్డి DRO
నిర్మల్ తహశీల్దార్ A. మోతీరామ్ ఎ. → మంచిర్యాల DRO
వనపర్తి నుంచి R. పాండు → నాగర్‌కర్నూల్ DRO
ఖమ్మం నుంచి V. రవికుమార్ → ములుగు DRO
కరీంనగర్‌కు చెందిన B. రాజేశ్వరి → పెద్దపల్లి DRO
పెద్దపల్లికి చెందిన KY. ప్రసాద్ → జగిత్యాల DRO
ఎస్డీసీ / ప్రత్యేక పోస్టింగులు
M. సుదర్శన్ రెడ్డి (సూర్యాపేట) → సిద్దిపేట ఎస్డీసీ
M. రమాదేవి (ఖమ్మం) → నల్గొండ ఎస్డీసీ
జనగామ తహశీల్దార్ CH. శ్రీకాంత్ → మహబూబ్‌నగర్ స్పెషల్ కలెక్టర్ పీఏ
G. కుమారస్వామి (పెద్దపల్లి) → సిరిసిల్ల ఎస్డీసీ
N. వెంకట్ రెడ్డి (కరీంనగర్) → కరీంనగర్ ఎస్డీసీ (ఎల్ఏ)


