అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vahan Sarathi Down | తెలంగాణ (Telangana) వ్యాప్తంగా వాహన సారథి సాఫ్ట్వేర్ నిలిచిపోయింది. దీంతో రవాణా శాఖ కార్యాలయాల్లో సేవలు ఆగిపోయాయి.
ప్రస్తుతం ఆర్టీఏ కార్యాలయాల్లో వాహన సారథి పోర్టల్ ద్వారా సేవలు అందిస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, ఇతర సేవల కోసం ప్రభుత్వం దీనిని అందుబాటులోకి తెచ్చింది. అయితే సోమవారం ఉదయం నుంచి పోర్టల్ (Vahana Sarathi Portal) సరిగా పని చేయడం లేదు.
Vahan Sarathi Down | వాహనదారుల ఇబ్బందులు

ఆర్టీఏ కార్యాలయాల్లో వాహనాల రిజిస్ట్రేషన్, లైర్నింగ్, పర్మినెంట్ లైసెన్స్‌ల కోసం స్లాట్ బుక్ చేసుకున్న ప్రజలు ఉదయాన్నే కార్యాలయాలకు వచ్చారు. అయితే సర్వర్ సమస్యతో గంటల తరబడి వారు క్యూలైన్లో నిరీకిస్తున్నారు. పోర్టల్ పునరుద్దరణకు గంట సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: K Namrata Missing | నా సోదరి కనిపించడం లేదు.. పోలీసులకు మహిళా కమిషన్ ఛైర్పర్సన్ ఫిర్యాదు