Rajiv Gandhi | మహిళా రిజర్వేషన్లు తెచ్చిన నాయకుడు రాజీవ్​గాంధీ : సీఎం రేవంత్​రెడ్డి

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajiv Gandhi | మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. సెక్రటేరియట్‌ ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన సేవలను స్మరించుకున్నారు.

ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. సాంకేతిక విప్లవాన్ని దేశానికి అందించింది రాజీవ్ గాంధీ అన్నారు. మహిళలకు రాజకీయాల్లో కూడా స్థానం ఉండాలని, మహిళా రిజర్వేషన్ల (Women Reservations)ను తీసుకొచ్చిన గొప్ప నాయకుడు అని కొనియాడారు. తెలంగాణ ప్రజలకు గాంధీ కుటుంబంతో గొప్ప అనుబంధం ఉందన్నారు. ఆయన స్ఫూర్తితో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నామని సీఎం పేర్కొన్నారు.

Rajiv Gandhi | కంప్యూటర్​ యుగంవైపు

దేశాన్ని కంప్యూటర్ యుగం వైపు నడిపించి ఒక దశ, దిశ చూపించిన నాయకుడు రాజీవ్ గాంధీ అని గుర్తుచేశారు. సాంకేతిక యుగం వైపు దేశ యువతను సన్నద్ధం చేసిన నాయకుడని పేర్కొన్నారు. టెలికాం, కంప్యూటర్ లాంటి ఆధునిక సాంకేతిక విప్లవం తేవడమే కాకుండా పరిపాలనలో మహిళలను భాగస్వామ్యం చేసినప్పుడే దేశం పురోభివృద్ధి సాధిస్తుందని భావించి స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించారని పేర్కొన్నారు. లోక్‌సభ, శాసనసభల్లో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి ఎలాంటి చిక్కుముడులు లేకుండా పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మరోసారి బిల్లును ప్రవేశపెట్టాలని ప్రధానమంత్రిని సీఎం కోరారు.

ఇది కూడా చదవండి..: Telangana Liquor Prices | తెలంగాణ మందుబాబులకు షాక్.. జూన్ 2 తర్వాత మద్యం ధరల పెంపు?

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *