అక్షరటుడే, వెబ్డెస్క్ : KTR Congress Comments | ఎన్నికల కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ప్రజలు కాంగ్రెస్ను బంగాళాఖాతంలో పడేస్తారని పేర్కొన్నారు.
అంబర్‌పేట్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. పార్లమెంట్‌లో BRS లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందన్నారు. తెలంగాణఏర్పాటును అవమానించేలా BJP ఎంపీ మాట్లాడితే.. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు మౌనంగా ఉన్నారని విమర్శించారు.
KTR Congress Comments | నగరంలో సౌకర్యాలు లేవు
రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) మాట్లాడితే ఫ్యూచర్ సిటీ అంటున్నారని, ఉన్న నగరంలో సౌకర్యాలు కల్పించే దిక్కులేదని కేటీఆర్ విమర్శించారు. ఇలాంటి నాయకుడు ఫ్యూచర్ సిటీని నిర్మిస్తాడా అని ప్రశ్నించారు. మూసీ నదిని ప్రక్షాళన చేస్తానని రేవంత్ చెబుతున్నారని, బీఆర్ఎస్ హయాంలోనే మూసీ ప్రక్షాళన మొదలైందని తెలిపారు. అనేక ప్రాంతాల్లో ఎస్‌టీపీలు ఏర్పాటు చేశామని చెప్పారు.
KTR Congress Comments | వారికే టికెట్లు
GHMC ఎన్నికల్లో సర్వేల ఆధారంగానే టికెట్లు ఇస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. గెలిచే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామన్నారు. నాయకుల చుట్టూ తిరిగే వాళ్లకు కాకుండా.. ప్రజల చుట్టూ తిరిగే నాయకులకు టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. ట్రాన్స్‌ఫార్మర్‌లకు, మోటార్లకు మీటర్లు పెడతారు అంట అని కేటీఆర్ అన్నారు. ఆనాడు మోదీ ఎంత ఒత్తిడి తెచ్చినా కేసీఆర్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకోలేదన్నారు.
KTR Congress Comments | పెద్దపులి వ్యవసాయ క్షేత్రంలో..
మన పెద్దపులి వ్యవసాయ క్షేత్రంలో రెస్ట్ తీసుకుంటుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మధ్యలో అప్పుడప్పుడు వచ్చిపోతేనే అందరికి భయం అవుతుందని ఎద్దేవా చేశారు. మన బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు మీ వెనక మేము ఉన్నామని భరోసా ఇచ్చారు.
అమ్మకి అన్నం పెట్టనోడు
చిన్నమ్మకి బంగారు గాజులు చేయిస్తానన్నాడట!ఉన్న నగరాన్నే పట్టించుకోని రేవంత్
“ఫ్యూచర్ సిటీ” కడతానంటే ఎవడు నమ్ముతాడు!– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS pic.twitter.com/4btfjpbdfk
— BRS Party (@BRSparty) May 24, 2026
దీనిని కూడా చదవండి : Ponguleti Paper Controversy | మంత్రి వాకిటి శ్రీహరి మీద పేపర్లు విసిరేసిన పొంగులేటి


