Nandipet Infant Abandonment | నందిపేట్​లో దారుణం.. పసికందును వదిలేసి వెళ్లిన వ్యక్తులు..

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Nandipet Infant Abandonment | నందిపేట్​లో (nandipet) అమానుష ఘటన చోటు చేసుకుంది. మండల కేంద్రంలో అప్పుడే పుట్టిన పసికందును గుర్తు తెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశంలో వదిలేసి వెళ్లారు.

Nandipet Infant Abandonment | రాజ్​నగర్​ ప్రాంతంలో..

నందిపేట మండల కేంద్రంలోని రాజ్​నగర్ దుబ్బ ప్రాంతంలో అప్పుడే పుట్టిన పసికందును (infant abandonment) గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అక్కడే క్రికెట్ ఆడుతున్న పిల్లలు శిశువు ఏడుపు శబ్దం విని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. వారు స్పందించి పసిబిడ్డను ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందిస్తుండగా బిడ్డ మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు (nandipet police) కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Hyderabad Car Stunts | కార్లతో స్టంట్లు.. షాక్​ ఇచ్చిన పోలీసులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *