Mayapur Murder Case | భర్తను హత్య చేసిన కేసులో భార్య, కొడుకు అరెస్ట్​..

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Mayapur Murder Case | నందిపేట్​లోని (Nandipet) మాయాపూర్​లో హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ మేరకు మండలంలోని పోలీస్​స్టేషన్​లో ఆర్మూర్​ రూరల్​ సీఐ జాన్​రెడ్డి (Armoor police) వివరాలు వెల్లడించారు.

Mayapur Murder Case | నందిపేట్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో..

సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మాయాపూర్​లో (Mayapur) ఈనెల 5న పుంటికూర ముత్యం మద్యం సేవించి నిద్రిస్తున్న సమయంలో అతడి భార్య లలిత చీర కొంగుతో మెడకు బిగించి హత్య చేసింది. కుటుంబ ఆర్థిక సమస్యలు, మృతుడి వివాహేతర సంబంధ వ్యవహారాల కారణంగా ఈ హత్య జరిగినట్లు పోలీసులు గుర్తించారు. అయితే కుమారుడు సహకరించగా భార్య లలిత హత్య చేసిన అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా మద్యం మత్తులో మంచం మీద నుండి పడిపోయి చనిపోయినట్లుగా నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ మృతుడి కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా (murder investigation) నిందితులు నేరాన్ని ఒప్పుకున్నట్లు సీఐ తెలిపారు. నిందితురాలు పుంటికూర లలిత, ఆమె కొడుకును కోర్టు ఎదుట హాజరుపర్చామని ఆయన పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Musi Project Works | రూ.7,055 కోట్లతో మూసీ ప్రాజెక్ట్​ పనులు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *